408 మంది ఉద్యోగులకు తాఖీదులు
408 మంది ఉద్యోగులకు తాఖీదులు
ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీల ఎన్నికల విధులకు గైర్హాజరైన 408 మంది ఉద్యోగులకు తాఖీదులు జారీ అయ్యాయి. రెండో దశగా కొవ్వూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామ పంచాయతీలకు శనివారం ఎన్నికలు నిర్వహించే నిమిత్తం 9,407 మంది పోలింగ్ అధికారులను, ఇతర పోలింగ్ సిబ్బందిని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ముత్యాలరాజు నియమించారు. వీరిలో 136 మంది పోలింగ్ అధికారులు, 272 మంది ఇతర పోలింగ్ సిబ్బంది ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల విధులకు గైర్హాజరైన కారణంగా షోకాజ్ నోటీసులు జారీచేశారు. తాఖీదులు అందుకున్న అధికారులు రాబోయే మూడు పని దినాల్లోగా సంబంధిత శాఖాధిపతి ద్వారా తమ సంజాయిషీని సమర్పించాలని తాఖీదుల్లో పొందుపరిచారు. లేనట్లయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
No comments