Latest

Loading...

తెల్లబియ్యం తినడం మానేస్తే ఒంట్లో జరిగే అధ్బుత మార్పులు.

  Amazing changes in our body if we stop eating white rice.

తెల్లబియ్యం తినడం మానేస్తే ఒంట్లో జరిగే అధ్బుత మార్పులు.



తెల్లబియ్యం .మన దేశంలో అత్యధికంగా తినబడే ఆహారం.కొన్ని ప్రదేశాల్లో దీన్ని రోజుకి ఒకటే పూట తింటారు.మరికొన్ని ప్రదేశాల్లో రెండు నుంచి మూడు పూటలు, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా తింటారు.మనం వింటూ ఉంటాం, తెల్ల బియ్యంని పాలీష్ చేస్తారని, దాంతో అందులో న్యూట్రింట్స్ తగ్గుతాయని, తెల్లబియ్యం తినడం వలన ఎన్నో నష్టాలు ఉన్నాయని, తెల్లబియ్యం తినడం తగ్గించాలని.కాని ఏం చేసేది మిగితా ఏం తిందాం అన్నా ధరలు ఎక్కువ.బియ్యం చవకగా దొరుకుతుంది.దాంతో పాటు కడుపు నింపుతుంది.చాలామంది బియ్యాన్ని వండుకొని తినడానికి కారణం ఇదే.అన్నం అయితే కడుపు నిండినట్టుగా అనిపిస్తుందని.మరి తెల్ల బియ్యం తినడం మానేస్తే ?

తెల్ల బియ్యం తినడం మానేస్తే మన శరీరంలో జరిగే మార్పులు 

జీర్ణవ్యవస్థమెరుగుపడుతుంది.

ఇప్పుడు కరెక్టుగానే ఉంది అని మీరు అనుకుంటున్నారేమో కాని మన జీర్ణవ్యవస్థ ఇంతకంటే మెరుగ్గా పనిచేయాలి.

తెల్ల బియ్యంలో ఫైబర్ శాతం పెద్దగా ఉండదు.

ఫైబర్ ఉంటేనే జీర్ణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది.కాబట్టి తెల్లబియ్యం మానేసి ఫైబర్ ఉండే ఆహారపదార్థాలు తింటే బెటర్. 

కార్బోహైడ్రేట్స్ బియ్యంలో ఎక్కువ కదా.

కాబట్టి బియ్యం తిందాం మానేస్తే ఆటోమేటిక్ గా బరువు తగ్గడం మొదలుపెడతారు.

మీకు అవసరానికి మించిన ఆకలి వేయదు.లిమిట్ గా తింటారు.

అవసరమైనంత మాత్రమె తింటారుబియ్యం తినడం వలన మీ ఒంట్లో స్టార్చ్ కంటెంట్ తగ్గుతూ ఉంటుంది.

ఈ స్టార్చ్ వలనే ఒంట్లో షుగర్ లెవల్స్ పెరిగిపోతూ ఉంటాయి.

బియ్యం మానేసిన తరువాత మెల్లిమెల్లిగా బ్లడ్ షుగర్ లెవల్స్ నార్మల్ స్టేజిలోకి వస్తుంటాయి

వైట్ రైస్ మానేసి, న్యూట్రిషన్ వాల్యూస్ ఉండే ఆహరం తినడం వలన శరీరానికి అందాల్సిన పోషకాలు అందుతాయి.

మీరు ఏ క్రీడాకారుడుని అయినా అడగండి, వారు బియ్యాన్ని ఎప్పుడో ఒకప్పుడు తింటారు.

సినిమా హీరోలు అయినా అంతే.

బాడి బిల్డర్స్ అయినా అంతే.

ఎప్పుడో ఒకప్పుడు సరదా మరియు రుచి కోసం బియ్యం తింటారు తప్ప, దాని మీద ఆధారపడరు.

కాబట్టి న్యూట్రింట్స్ ఉండే ఆహారాల్ని తీసుకోండి.శరీర భాగాలు చాలా మెరుగ్గా పనిచేస్తాయి.

మీరు ఊరికే అలసిపోరు.తినగానే నిద్ర కూడా రాదు.

యాక్టివ్ గా ఉంటారు. మలబద్ధకం, అజీర్ణం, పొట్ట, లివర్ సమస్యలు, తక్కువ జ్ఞాపకశక్తి .

ఇలాంటి సమస్యలన్నీ తగ్గుముఖం పడుతాయి.

No comments

Powered by Blogger.