Latest

Loading...

badam - బాదంను పొట్టు తీసి తినాలా..? తీయకుండానా..?

 badam - బాదంను పొట్టు తీసి తినాలా..? తీయకుండానా..?


బాదం పప్పు చాలా ఆరోగ్యరకరం. రోగనిరోధక శక్తిని పెంపొందించేందకు, మెదడు ఏకాగ్రతను మెరుగుపరిచేందుకు శరీరానికి కావాల్సిన శక్తిని అందించేందకు బాదం బాగా ఉపయోగపడుతుందని అందరికీ తెలిసిందే. అంతేకాదు వీటిలో ఆరోగ్యకరమైన విటమిన్లు, పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా వీటిలో విటమిన్-ఇ, ఒమేగా-3 సమృద్దిగా లభిస్తాయి. కాబట్టి వీటిని చాలా మంది ప్రతిరోజూ తింటుంటారు. కొందరు వీటిని ఉదయాన్నే తింటే.. ఇంకొందరు సాయంత్రం స్నాక్స్ తో కలిపి తింటుంటారు.

ఇలా కాకుండా వీటిని రాత్రి నానబెట్టి ఉదయం తినే వారి సంఖ్య మరింత ఎక్కువ అనే చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే.. నానబెట్టిన బాదంలను పొట్టు తీసి తినాలా..? లేదంటే పొట్టుతో కలిపి తినేయాలా..?
అని. ఈ అనుమానం మీకూ వచ్చిందా.. అయితే మా దగ్గర సమాధానం ఉంది. పదండి.

బాదం పప్పులో ఎలా అయితే ఆరోగ్యకరమైన పోషక విలువలు ఉంటాయో అలాగే. బాదం పొట్టులో కూడా విటమిన్- ఇతో పాటు ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి వీటిని పొట్టు తీసి తినాల్సిన అవసరం లేదంటున్నారు పోషకాహార నిపుణులు. నానబెట్టిన బాదం పప్పులను అలాగే నేరుగా పొట్టుతో కలిపి తినేయచ్చు అనడంలో సందేహం అవసరం లేదు. కాకపోతే.. మీలో ఎవరైనా అజీర్ణంతో బాధపడుతుంటే అప్పుడు బాదం పొట్టు తీసి తినడం మంచిది.

ఎందుకంటే.. అజీర్తి సమస్య ఉన్నవారు పొట్టును తినడం వల్ల కొన్నిసార్లు సమస్య తీవ్రతరం అయ్యే అవకాశాలున్నాయి. (చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఇలా జరగవచ్చు) బాదం పప్పులతో పాటు.. నువ్వులు, గుమ్మడికాయ, పుచ్చకాయ గింజలు, పొద్దుతిరుగుడు గింజలను రాత్రి నానబెట్టుకుని ఉదయం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఇనుము ఎక్కువగా లభిస్తుంది. హార్మోన్ల సమతుల్యత కోసం నల్ల ఎండుద్రాక్షలను కూడా నానబెట్టుకుని తినచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

No comments

Powered by Blogger.