Latest

Loading...

నిమ్మగడ్డ మరో సంచలనం..! ఇక మున్సిపల్‌ ఎన్నికలు..?

  నిమ్మగడ్డ మరో సంచలనం..! ఇక మున్సిపల్‌ ఎన్నికలు..?

ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి... తొలి విడత ఎన్నికలు ముగియడంతో.. రెండో విడతకు సిద్ధమవుతోంది ఎస్‌ఈసీ.. అయితే, పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే.. మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ కూడా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగానే.. మున్సిపల్ ఎన్నికలకు వెళ్లేందుకు ఎస్ఈసీ సిద్ధంగా ఉందని.. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

కాగా, గతంలో 75 మున్సిపాలిటీలు, 12 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలకు నోటిఫికేషన్ రావడం..
నామినేషన్లు స్వీకరణ ప్రక్రియతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్‌ కారణంలో ఎన్నికలు వాయిదా వేసింది ఎస్‌ఈసీ.. అయితే, అదే ప్రక్రియ తిరిగి ఎస్‌ఈసీ ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, తిరిగి ప్రారంభిస్తారా? కొత్తగా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.. పాత నోటిఫికేషన్‌ రద్దు చేయకపోతే.. ప్రభుత్వం నుంచి కూడా పెద్దగా అభ్యంతరాలు రాకపోవచ్చు అంటున్నారు. కానీ, కొత్త నోటిఫికేషన్‌ వస్తే మాత్రం న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందంటనున్నారు. మరి నిమ్మగడ్డ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


No comments

Powered by Blogger.