ఎస్ఈసి నిమ్మగడ్డపై మరో ప్రివిలేజ్ నోటీస్?
ఎస్ఈసి నిమ్మగడ్డపై మరో ప్రివిలేజ్ నోటీస్?
మంత్రి కొడాలి నానిపై ఎస్ఈసి చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈనెల 21 వరకు మీడియాతో మాట్లాడకూడదని ఆంక్షలు విధించింది. అంతేకాదు, వివరణ ఇచ్చినప్పటికీ నానిపై కేసులు ఫైల్ చేయాలని ఎస్పీకి ఎస్ఈసి ఆదేశాలు ఇవ్వడంతో మరోసారి రగడ మొదలైంది. ఎస్ఈసి ఆదేశాలను సవాల్ చేస్తూ మంత్రి కొడాలి నాని హైకోర్టులో కేసు ఫైల్ చేస్తున్నారు. హౌస్ మోషన్ పిటిషన్ ను ఫైల్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా వివరణ ఇచ్చిన కేసులు ఫైల్ చేయమని ఆదేశాలు జారీ చేయడంతో, కొడాలి నాని ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయబోతున్నారు. ఇప్పటికే మంత్రులు బొత్సా, పెద్దిరెడ్డిలు సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఇవాళ, రేపు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.
No comments