సీఏఏ .. ముస్లింల పౌరసత్వం తొలగింపు: క్లారిటీ ఇచ్చిన అమిత్ షా
సీఏఏ .. ముస్లింల పౌరసత్వం తొలగింపు: క్లారిటీ ఇచ్చిన అమిత్ షా
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై వదంతులను నమ్మవద్దన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోరారు. పశ్చిమ బెంగాల్‌లోని మతువాలో గురువారం ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ... కోవిడ్-19 నిరోధక వ్యాక్సినేషన్ పూర్తయిన వెంటనే అందరికీ పౌరసత్వం ఇస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు.
ముస్లింల పౌరసత్వాన్ని తొలగించే నిబంధన ఏదీ ఈ చట్టంలో లేదని ఆయన వెల్లడించారు. గడచిన 70 ఏళ్ళ నుంచి భారత దేశంలో నివసిస్తున్నవారందరికీ పౌరసత్వం ఇస్తామని అమిత్ షా చెప్పారు. పుకార్లను ప్రచారం చేసేవారి చేతుల్లో పావులుగా మారవద్దని హోంమంత్రి హితవు పలికారు.
పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలు ఏప్రిల్/మే నెలల్లో జరగవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మతువా సామాజిక వర్గానికి చెందినవారు రాష్ట్రంలో దాదాపు 1.8 కోట్ల మంది ఉన్నారని.. రాష్ట్రంలోని ఎస్సీ కులాల్లో రెండో అతి పెద్ద సామాజిక వర్గం ఇదేనని హోంమంత్రి స్పష్టం చేశారు.
కాగా వీరి ప్రభావం ప్రత్యక్షంగా 70 శాసన సభ నియోజకవర్గాల్లో ఉంటుంది. వీరు గతంలో మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీవైపు ఉండేవారు. కానీ 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో వీరు బీజేపీ వైపు మొగ్గు చూపారు. పౌరసత్వం ఇస్తామనే హామీ మేరకు వీరు బీజేపీకి మద్దతిచ్చారు.
No comments