Latest

Loading...

పుంగనూరు పర్యటనకు వెళ్ళిన నిమ్మగడ్డ.. పోలీసుల అభ్యతరం !

   పుంగనూరు పర్యటనకు వెళ్ళిన నిమ్మగడ్డ.. పోలీసుల అభ్యతరం !


చిత్తూరు జిల్లా పుంగనూరులో పర్యటించేందుకు గాను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిన్న రాత్రి పుంగనూరు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు పుంగనూరులో ఆయన పర్యటించాల్సి ఉంది. మూడో విడత పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలను ఆయన పరిశీలించాలని అక్కడికి వెళ్లారు. అయితే పర్యటనకు ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం అధికారులు పోలీసులను కోరడంతో పోలీసులు అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది.


శాంతిభద్రతల సమస్యగా మారే అవకాశం ఉందన్న పోలీసులు ఆ ఏర్పాటు చేయలేమని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే కోర్టు తీర్పుతో పుంగనూరు లో పర్యటించి ఏకగ్రీవాల మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు పోలీసులకు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మరి నిమ్మగడ్డకు పోలీసులు భద్రత కల్పిస్తారా లేక చేయలేమని చేతులెత్తేస్తారా ? అనేది ఆసక్తికరంగా మారింది. ఏమవుతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది.

No comments

Powered by Blogger.