మున్సిపొల్స్‌కు ఎపి ప్రభుత్వ రాతపూర్వక అంగీకారం
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు
రాతపూర్వక అంగీకారాన్ని ఎపి ప్రభుత్వం తెలిపింది. ఒకటి, రెండు రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలు పూర్తవ్వగానే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. గతేడాది మార్చిలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల ప్రక్రియను నిలిపేశారు. తిరిగి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ఎస్‌ఇసి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక సమాచారం ప్రభుత్వానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 23 న నోటిఫికేషన్‌ను ఇవ్వడం, వచ్చే నెల 17 వ తేదీన, లేకపోతే మూడో వారంలో ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్, కౌంటింగ్ జరిగే అవకాశమున్నట్లు అధికారవర్గ సమాచారం.
No comments