Latest

Loading...

Drinking Water - మనిషి మనుగడకు నీళ్లు ఎంతో అవసరం... ఎలా ఎప్పుడెప్పుడు నీరు తీసుకోవాలి....ఎప్పుడు తీసుకోకూడదు..వివరాలు...

   


మనిషి మనుగడకు నీళ్లు ఎంతో అవసరం. నీళ్లతో మానవుని ఆరోగ్యానికి ఎంతో సంబంధం ఉంది. మంచినీళ్లు బాగా తాగాలని వైద్యులు చెబుతారు. అయితే… ఏం చేసినా 'అతి' అనేది పనికి రాదు. అలాగే నీళ్లు కూడా అతిగా తాగితే.. ప్రమాదమే అంటున్నారు వైద్యులు. సాధారణంగా మానవ మూత్రపిండాలు రోజు 20 నుంచి 28 లీటర్ల నీటిని వడపోయగలవు. కానీ అవి గంటకు 0.8-1.0 లీటర్ల కంటే ఎక్కువ నీటిని శుద్ధి చేయలేవు. అందువల్ల గంటకు సగటున 1.0 నీరు కన్నా ఎక్కువ తాగకూడదు.

సూచనలు :

నీటిని గుటక గుటకగా ఒక్కొక్క గుటక నోటిలో నింపుకొంటూ చప్పరిస్తూ తాగాలి

ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగితే..శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి

స్నానానికి వెళ్లే 10 నిమిషాల ముందు ఒక గ్లాస్‌ నీరు తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది

భోజనానికి 30 నిమిషాల ముందు ఒక గ్లాసు నీరు తాగితే జీర్ణక్రియ బాగా జరుగుతుంది.

రాత్రి నిద్ర పోవడానికి ఒక గంట ముందు ఒక గ్లాస్‌ నీరు తాగాలి

భోజనం చేసేటపుడు మధ్య నీరు త్రాగకూడదు

ఎండలో నుంచి నీడలోనికి వచ్చిన వెంటనే నీరు త్రాగకూడదు.

స్నానం చేసిన వెంటనే, మల, మూత్ర చేసిన వెంటనే నీటిని త్రాగకూడదు.

No comments

Powered by Blogger.