Eating Dinner: రాత్రి 8 తర్వాత భోజనం చేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే పరిస్థితేంటో..!
Eating Dinner: రాత్రి 8 తర్వాత భోజనం చేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే పరిస్థితేంటో..!
ఆహార నియమాలు అందరికీ ఒకేలా వర్తించవు. ఎవరి ఇష్టం వారిది. అయితే చాలామందికి రాత్రి డిన్నర్ ఎన్ని గంటలకు తింటే ఆరోగ్యంగా ఉంటామోనన్న సందేహం ఉంటుంది. ఆ సందేహానికి సర్వే ద్వారా సమాధానమిచ్చారు పరిశోధకులు. ఇటీవల కాలంలో మనిషి జీవన శైలికి సంబంధించి ఓ సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వే ప్రకారం రాత్రి పూట ఎనిమిది గంటలు తర్వాత ఎవరైతే ఆహారం తీసుకుంటారో వారి శరీరంలో బాడీ మాస్ ఇండెక్సెస్ (బిఎమ్‌ఐ) అధిక శాతంలో పెరుగుతుందని తేలింది. వెల్లడించారు. ఇక ఎవరైతే ఈ టైంలో ఆహారం తీసుకోకుండా అంతకు ముందు తీసుకుంటారో వారిలో శరీరంలో మాత్రం బాడీ మాస్ ఇండెక్సెస్ (బిఎమ్‌ఐ) చాలా తక్కువగా ఉన్నయని పరిశోధకులు వెల్లడించారు. రాత్రిపూట ఎవరైతే స్నాక్స్ రూపంలో గానీ, ఆహార రూపంలో గానీ ఎనిమిది తర్వాత తీసుకుంటారో వారు మాత్రం శరీరంలో కొవ్వు శాతం చాలా ఎక్కువగా పెరిగి బాగా లావుగా కనిపించనున్నట్లు సర్వేలో వెల్లడించారు.
అంతేకాకుండా రాత్రి సమయంలో కాకుండా పగలు అంతే కాలరీలు తీసుకునే వారిలో మాత్రం తేడా ఉన్నట్లు సర్వే అధికారులు వెల్లడించడం జరిగింది. ఇది మాత్రమే మనిషి యొక్క శరీరం తీరు అతను టైమ్‌కి ఆహారం తీసుకునే విధానం, రాత్రుళ్ళు అతని నిద్ర మీద కూడా ఆధారపడి ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం ఆహారం తినేవారు, రాత్రిపూట ఆహారం తీసుకునే వారిలో క్యాలరీల శాతం చాలా ఎక్కువగా ప్రభావం చూపుతుందని వెల్లడించారు.
రాత్రిపూట కొంత మంది ఫ్రూట్స్ , ఫలహారాలు తీసుకుంటుంటే మరికొంత మంది జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నట్లు సర్వెలో తేలింది, చివరగా సర్వే అధికారులు విషయంలో వెల్లడైంది ఏమిటంటే చాలా మంది టైమ్‌కి ఆహారం తీసుకోక పోవడం వల్లనే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇలాంటి వాటన్నింటిని అధిగమించాలంటే సరైన టైమ్‌కి ఆహారం తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని వెల్లడించారు.
No comments