Health Tips _ జలుబు చేసినప్పడు అస్సలు తినకూడని మూడు పదార్థాలేంటో తెలుసా!
Health Tips _ జలుబు చేసినప్పడు అస్సలు తినకూడని మూడు పదార్థాలేంటో తెలుసా!
మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు సరైన ఆహారం తీసుకోవడం కంటే మరేదీ ఉత్తమమైన మార్గం కాదు. ముఖ్యంగా అలాంటప్పుడు మీరు తీసుకునే ఆహారం.. సమతుల్యతతో, పోషకాలతో, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉండాలని మీరు కోరుకుంటారు. కానీ జలుబు చేసినప్పడు మాత్రం ఆహారం తినడానికి ఇష్టపడరు. అందుకనే కొన్నిసార్లు రుచిగా ఏదైనా తినాలని ఏది పడితే అది తినేస్తుంటారు.
అక్కడే మీరు ప్రమాదం కొనితెచ్చుకున్న వారవుతారు. నిజానికి జలుబు చేసినప్పడు చాలా జాగ్రతగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇలాంటప్పుడు అస్సలు తినకూడని ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయట. వాటిలో ముఖ్యమైన ఓ మూడింటిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పాలు
ఆరోగ్యం బాగాలేదంటే చాలు అన్నీ మానేసి కేవలం పాలు మాత్రమే తాగే వారు చాలా మంది ఉన్నారు.
కానీ.. ఇది అతిపెద్ద పొరబాటు అంట ముఖ్యంగా జలుబు చేసినప్పడు పాలు అస్సలు తాగకూడదు. ఎందుకంటే.. పాలు అనేవి శ్లేష్మం ఉత్పత్తిని పెంచడమే కాక, ఉత్పత్తి చేయబడిన శ్లేష్మం గట్టిపడానికి కారణమవుతాయి. అంతేకాదు పాల ఉత్పత్తులు మంటను కూడా ప్రేరేపిస్తాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనను నెమ్మదించి అనారోగ్య లక్షణాలను తీవ్రతరం చేస్తాయి.
ప్రాసెస్ చేసిన ఆహారాలు
మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు మీరు వంట కోసం ఎదురుచూడరు. ప్రాసెస్ చేసిన ఆహారాలకే ప్రాముఖ్య ఇస్తారు. కానీ ప్రాసెస్ చేసిన ఆహారాలు మంటను రేకెత్తిస్తాయి. అంతేకాదు వాటికి పరిమితమైన పోషకాలు ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి హానికరం.
ఆల్కహాల్
మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు మద్యం చెడ్డది కాదు. కానీ ఒక గ్లాసు వైన్ లేదా విస్కీ మాత్రమే. అంతకుమించి.. కొన్ని ప్రమాదకరమైన సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. ఎందుకంటే ఆల్కహాల్ మిమ్మల్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఇది మీ శ్లేష్మాన్ని చెడు పదార్థాంగా మార్చడమే కాక తలనొప్పికి దారితీస్తుంది. మీ రోగనిరోధక శక్తిని కూడా నెమ్మదిస్తుంది.
No comments