Latest

Loading...

Health Tips మీ ముఖం తెల్లగా మెరుస్తూ ఉండడానికి ఈ పద్ధతులు పాటించండి...

   Health Tips మీ ముఖం తెల్లగా మెరుస్తూ ఉండడానికి ఈ పద్ధతులు పాటించండి...


చర్మ సంరక్షణ విషయంలో తేనె, కొబ్బరి నూనె రెండింటికి చాలా ప్రాధాన్యముంది. మన ముందు తరాల వారు సైతం చర్మాన్ని అందంగా మార్చుకోవడానికి వీటిని ఉపయోగించేవారు. తేనెలో ఉండే హైడ్రాక్సిల్ యాసిడ్, ఇతర ఎంజైమ్లు చర్మం మీద ఉన్న మొటిమల కారణంగా ఏర్పడిన మచ్చలను తగ్గించి స్కిన్ టోన్‌ను మెరుగుపరుస్తుంది. చర్మ కణాలను ఆరోగ్యంగా మారుస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముదిమి ఛాయలు రాకుండా, చర్మం ముడతలు పడకుండా కాపాడుతాయి. దీనివల్ల స్కిన్ టెక్స్చర్ సైతం మెరుగుపడుతుంది. గిన్నెలో టేబుల్ స్పూన్ చొప్పున తేనె, కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఐదు నుంచి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. చర్మం అందంగా, యవ్వనంగా, బ్రైట్‌గా కనిపించాలంటే.. ఈ కలబంద గుజ్జు,రోజ్ వాటర్, పసుపు మూడు పదార్థాలతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ వేసుకోవాల్సిందే. ఇది చర్మానికి కావాల్సిన పోషణను అందించి బ్రైట్‌గా కనిపించేలా చేస్తుంది.

గిన్నెలో టీస్పూన్ కలబంద గుజ్జు, రెండు టీస్పూన్ల రోజ్ వాటర్, టీస్పూన్ పసుపు పొడి వేసి బాగా కలపాలి. మిశ్రమం చిక్కగా అయ్యేంత వరకు కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. 25 నుంచి 30 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.గిన్నెలో టీస్పూన్ శెనగపిండి, అరకప్పు పాలు, ఒక స్పూన్ తేనె తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఈ మాస్క్‌ను 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఈ సమయంలో దాన్ని తాకకూడదు. నిర్ణీత సమయం తర్వాత మైల్డ్ సోప్ ఉపయోగించి గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుంది.


బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ స్కిన్ టోన్ మెరుగుపరిచి ప్రకాశవంతంగా మారేలా చేస్తుంది. పైగా ముఖంపై ఉన్న మచ్చలను సైతం చర్మం రంగులో కలిసిపోయేలా చేస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో పెరుగుకు సాటి వచ్చేది ఏదీ లేదు. అలాంటిది ఈ రెండూ కలిపి ఫేస్ మాస్క్‌గా అప్లై చేసుకొంటే మరింత మంచి ఫలితం కనిపిస్తుంది.బొప్పాయిని చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేయాలి. ఆ తర్వాత టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసి మిక్సీ ఆన్ చేసి పేస్ట్‌గా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌లా వేసుకొని 10 నుంచి 15 నిమిషాలు ఆగాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

No comments

Powered by Blogger.