Latest

Loading...

Health Tips -పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ను ఇలా తగ్గించుకోవచ్చు..!

  Health Tips -పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ను ఇలా తగ్గించుకోవచ్చు..!


మనం తీసుకునే ఆహారం కారణంగా మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. ఈ జంక్ ఫుడ్ తయారీ విషయంలో చాలా వరకు ఫ్యాట్ అధికంగా ఉన్న పదార్థాలను వాడతారు. తద్వారా మనిషి శరీరంలో కొవ్వు అధికంగా ఉండడమే కాకుండా,ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ఇక ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి, చూడడానికి ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉంటారు. అయితే కొన్ని చిట్కాలు పాటించి, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును ఇట్టే తగ్గించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆ చిట్కా ఏంటో ఇప్పుడు జరిగే తెలుసుకుందాం.


పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గించుకోడానికి రోజూ వ్యాయామాలు చేస్తూనే,నిమ్మకాయ,అల్లం కలిపి తయారుచేసిన టీ ని తాగాలి.

ఎలాంటి ఆహార నియమాలు అవసరం లేదు. కేవలం ఐదు రోజుల్లోనే ఈ డ్రింక్ తాగడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గి పోవడం గమనించవచ్చు. అల్లం,నిమ్మకాయ రసం ద్వారా చేసిన డ్రింక్ ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చు. అల్లంలో జింజో రోల్స్, షోగౌల్స్ ఉండడం వల్ల శరీరంలో మంటలు తగ్గుతాయి. అలాగే జీర్ణ ప్రక్రియను క్రమబద్దీకరిస్తాయి. క్రమేణా ఆకలి కూడా తగ్గుతుంది. ఇక ఫలితంగా బరువు తగ్గొచ్చు.


నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది కూడా ఆకలిని తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ రెండు కలిపిన డ్రింక్ ని తాగడం వల్ల అధిక బరువు నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ఇప్పుడు ఆ పానీయం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..


ఒక నిమ్మకాయ తీసుకొని, దాని రసాన్ని ఒక గిన్నెలో పిండాలి. తాజా అల్లం ముక్కని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసి, ఒక గిన్నెలో వేయాలి. ఇప్పుడు గిన్నెలో మూడు కప్పుల నీరు పోసి, అందులో నిమ్మరసం కలపండి. ఇప్పుడు ఆ నీటిని 10 నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఇక బాగా మరుగుతున్న సమయంలో స్టవ్ కట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడగట్టి, వేడిగా ఉన్నప్పుడు ఇలాగైనా తాగొచ్చు లేదా చల్లారిన తర్వాత పానీయం లాగైనా సేవించవచ్చు . రుచికోసం కావాలంటే తేనె కలుపుకొని తాగవచ్చు. అయితే పరగడుపున ఈ పానీయాన్ని సేవించడం వల్ల 3 నుండి 5 రోజుల్లో బరువు తగ్గడం గమనించవచ్చు.

No comments

Powered by Blogger.