IOCL Recruitment 2021: Apply For 505 Apprentice Posts
IOCL Recruitment 2021: Apply For 505 Apprentice Posts
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో అప్రెంటిస్ 505 జాబ్స్
IOCL Recruitment 2021: Apply For 505 Apprentice Posts
ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు
ఫిబ్రవరి 26 దరఖాస్తులకు చివరితేది
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్).. అర్హులైన అభ్యర్థుల నుంచి 505 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో అప్రెంటీస్‌షిప్ అవకాశాలను కల్పించనుంది.
మొత్తం ఖాళీలు: 505
విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెషినిస్ట్, ఫిట్టర్, రిటైల్ సేల్స్ అసోసియేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్ తదితర విభాగాలున్నాయి.
ప్రాంతాలు: పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిషా, జార్ఖండ్, అసోం
అర్హతలు: ఐటీఐ, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఆయా విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయసు: జనవరి 31.2021 నాటికి 24 ఏళ్లకు మించకుండా ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం- రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది.
అప్రెంటిస్‌షిప్ కాలవ్యవధి: 12నెలల నుంచి 15నెలల వరకు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 26.02.2021.
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చివరి తేదీ: 01.03.21.
రాత పరీక్ష తేదీ: 14.03.2021.
WEBSITE :https://iocl.com/
No comments