రైళ్లు ప్రారంభమయ్యేది ఆ రోజేనా?
Is that the day trains start?
రైళ్లు ప్రారంభమయ్యేది ఆ రోజేనా?
కరోనా లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన రైల్వే సేవలు పూర్తిస్థాయిలో త్వరలోనే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రత్యేక రైళ్ల పేరిట కొన్ని రైళ్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ అవేవీ ప్రయాణికుల అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చలేకపోతున్నాయి. దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తమ సేవలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు సమాచారం. ఏప్రిల్ 1 నుంచి రాజధాని, శతాబ్ది సహా అన్ని రకాల రైళ్లు ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు సన్నాహాలు కూడా సాగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం 65 శాతం రైళ్లు మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి.
పైగా చిన్న చిన్న స్టేషన్లలో ఈ రైళ్లేవీ ఆగడం లేదు. ప్రత్యేక రైళ్లుగా నడుస్తుండడంతో వీటిలో టికెట్ ధర కూడా కొంతమేర అధికంగానే ఉంటోంది. దేశీయంగా అన్ని రకాల కార్యకలాపాలు ఊపందుకోవడంతో ప్రయాణికుల రాకపోకలు అధికంగా సాగుతున్నాయి. దీంతో ఏ రైలు చూసినా వెయిటింగ్ లిస్ట్ జాబితానే కనిపిస్తోంది. అయితే రైల్వే సేవలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
No comments