పాలసీదార్లకు డిజిటల్ పాలసీలు జారీ చేయండి డిజి లాకర్‌లో భద్రపరచుకోవడమూ నేర్పండి బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ అదేశం
Issue digital policies to policyholders
Teach them to store in the Digi Locker
పాలసీదార్లకు డిజిటల్ పాలసీలు జారీ చేయండి
డిజి లాకర్‌లో భద్రపరచుకోవడమూ నేర్పండి
బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ అదేశం
దిల్లీ: పాలసీదార్లకు డిజిటల్ పాలసీలు జారీ చేయాల్సిందిగా బీమా సంస్థలను బీమా నియంత్రణ ప్రాథికార సంస్థ ఐఆర్‌డీఏఐ ఆదేశించింది. డిజిటల్ పత్రాలను డిజిలాకర్‌లో ఎలా భద్రపరచుకుకోవాలో కూడా తెలియజేయాల్సిందిగా సూచించింది. డిజిటల్ పాలసీల జారీతో ఖర్చులు తగ్గుతాయని, క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్ ప్రక్రియ కూడా వేగవంతం కావడానికి దోహదపడుతుందని ఐఆర్‌డీఏఐ చెబుతోంది. జీఐసీ ఆర్‌ఈ, లాయిడ్స్ (ఇండియా), విదేశీ రీ-ఇన్సూరెన్స్ శాఖల (ఎఫ్‌ఆర్‌బీలు)తో పాటు అన్ని బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
డిజిలాకర్‌తో ఖర్చులు తగ్గుతాయని, పాలసీలు డెలివరీ కాలేదని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావని పేర్కొంది. వివాదాలు, మోసాలు సైతం తగ్గుతాయని, వినియోగదారులను చేరుకోవడం సులభతరమవుతుందని వెల్లడించింది.
No comments