Lemon Water Benefits: నిమ్మరసంతో కమ్మనైన ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకుందాం పదండి..
Lemon Water Benefits: మనం తినే ఏ వంటకంలోనైనా నిమ్మరసం పిండితే ఆ వంటకానికి చక్కని రుచి వస్తుంది. అలాగే నిమ్మకాయ వాసన చూస్తే తాజా అనుభూతి కలుగుతుంది. దీంతోపాటు నిమ్మరసం వల్ల మనకు అనేక లాభాలున్నాయి. డైట్ ఫాలో అయ్యే వారు కనీసం రోజుకు ఒక్కసారైనా ఒక్క గ్లాస్ ఈ కాంబినేష్ డ్రింక్ ను తాగాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో కొంచం నిమ్మ రసం కలుపుకొని త్రాగడం వల్ల మెరుగైన ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.
నిమ్మరసం కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం పదండి:
బరువు తగ్గించడానికి: వెయిట్ తగ్గడానికి నిమ్మరసం బాగా పనిచేస్తుందని చాలామంది చెప్పేమాట. కొద్దిగా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కొన్ని చుక్కల తేనె మిక్స్ చేసి ఉదయాన్ని పరకడుపు తీసుకొన్నట్లైతే శరీరంలో నిల్వ ఉన్న క్యాలరీలను, అధిక కొవ్వును కరిగించడానికి బాగా సహాయపడుతుంది.
జీర్ణవ్యవస్థను క్రమబద్దీకరిస్తుంది: నిమ్మరసం జీర్ణవ్యవస్థకు చక్కని పానీయం. జీర్ణవ్యవస్థకు సంబంధించిన రుగ్మతలను అరికడుతుంది. మీరు గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నట్లైతే నిమ్మరసం, తేనె మిశ్రమాన్ని కలిపిన జ్యూస్ సేవిస్తే.. ఉపశమనం లభిస్తుంది.
ఒత్తిడికి కూడా నిమ్మరసమే మందు: డైలీ ఉదయం, సాయంత్రం కాస్త గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే మానసిక ఒత్తిడిని తగ్గించి నూతన ఉత్సాహాం లభిస్తుంది.
చిగుళ్ల వ్యాధులకు: పంటినొప్పిని తగ్గించడంతో పాటు చిగుళ్ల నుంచి వెలువడే రక్తస్రావాన్ని సైతం నిమ్మరసం నియంత్రిస్తుంది.
కాలేయం మెరుగైన పనితీరు కోసం : శరీరంలో అతిముఖ్యమైన అవయవాలలో ఒకటైన కాలేయంలో పేరుకున్న విషపదార్థాలను సైతం నిమ్మరసం తొలగిస్తుంది. కాలేయం మెరుగ్గూ పనిచేసేలా ఉపయోగపడుతుంది.
కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది: కిడ్నీలో ఏర్పడే చిన్న చిన్న రాళ్లను నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ కరిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
డయాబెటిస్ ఉన్నవారు నిమ్మరసం తాగడం వల్ల వారికి కలిగే లాభాలేమిటో చూద్దాం.
నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది డయాబెటిస్ వచ్చే అవకాశాలను తగిస్తుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారికి ఇతర సమస్యలను రాకుండా చేస్తుంది.
ఒక మీడియం సైజు నిమ్మకాయలో 2.4 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. మనకు నిత్యం కావల్సిన ఫైబర్‌లో ఇది 9.6 శాతం ఉంటుంది. ఈ క్రమంలో డయాబెటిస్ ఉన్నవారు నిమ్మరసం తాగడం వల్ల ఆ ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. దీంతో ఇన్సులిన్ ఎక్కువగా అవసరం ఉండదు. ఫలితంగా డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అలాగే లో బీపీ ఉండే డయాబెటిస్ వ్యాధి గ్రస్తుల బీపీని నియంత్రణలో ఉంచుతుంది.
డయాబెటిస్ ఉన్నవారికి గుండె జబ్బులు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే నిమ్మరసం తాగడం వల్ల అందులో ఉండే పొటాషియం గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారికి సహజంగానే జీర్ణ సమస్యలు ఉంటాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవకపోవడం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వస్తాయి. అలాంటి వారు నిమ్మరసం తాగితే ఫలితం ఉంటుంది.
No comments