Latest

Loading...

ఎస్‌బీఐ పెన్షన్ లోన్‌..వడ్డీ ఎంత, ఎవరు అర్హులు..

 SBI Pension Loan..what is the interest, who is eligible ..

ఎస్‌బీఐ పెన్షన్ లోన్‌..వడ్డీ ఎంత, ఎవరు అర్హులు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బ్యాంకు ద్వారా పెన్షన్ పొందే సీనియర్ సిటిజన్లకు, కుటుంబ ఫించను దారులకు పెన్షన్ రుణాలను 9.75 శాతం వడ్డీతో ఆఫర్ చేస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. పిల్లల పెళ్ళి, సొంత ఇంటి కొనుగోలు, విహార యాత్రలు, వైద్య ఖర్చులు వంటి వ్యక్తిగత ఆర్థిక అవసరాలకు ఫించను దారులు ఈ వ్యక్తిగత రుణాన్ని ఉపయోగించుకోవచ్చు. రుణాన్ని సులభంగా, ఎటుంటి ఇబ్బందులు లేకుండా పొందవచ్చు, తిరిగి చెల్లించవచ్చు.

భారతీయ అతి పెద్ద బ్యాంక్ ఈ విధంగా ట్విట్ చేసింది. 9.75 శాతం వడ్డీతో రుణాన్ని పొందండి. పదవీ విరమణ జీవితాన్ని ఆనందించండి. ఇందుకోసం అని టైప్ చేసి 7208933145 నెంబరుకి ఎస్ఎమ్ఎస్ చేయవచ్చు.
ఎస్‌బీఐ పెన్షన్ లోన్ ఫీచర్లు:
* తక్కువ ప్రాసెసింగ్ ఫీజు
* హిడెన్ ఛార్జీలు లేవు
* రుణ ప్రాసెంసింగ్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తారు
* సరళ వడ్డీతో సులభంగా ఈఎమ్ఐ
* కనీస డాక్యుమెంటేషన్
* ఎస్‌బీఐ అన్ని బ్రాంచిలలోను రుణ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

అర్హత:
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బ్యాంకు ద్వారా పెన్షన్ పొందుతూ ఉండాలి
* పెన్షనర్ వయస్సు 76 ఏళ్లలోపు ఉండాలి.
* పెన్షన్ చెల్లింపు ఆర్డర్‌ను ఎస్‌బిఐ వద్ద నిర్వహిస్తుండాలి.
* రుణ కాలంలో ఫించను ఆర్డర్‌ను వేరే బ్యాంకుకు బదిలీ చేయకూడదు. ఇందుకోసం ట్రెజరీని అభ్యర్ధించాలి.
* ఎన్‌ఓసి జారీ అయ్యేవరకు పెన్షనర్ తన పింఛను చెల్లింపును మరే బ్యాంకుకు బదిలీ చేయమని పింఛనుదారుడు చేసిన అభ్యర్థనను అంగీకరించినట్లు ట్రెజరీ నుంచి లిఖితపూర్వకంగా సమ్మతి ఉండాలి.
* ఈ పథకానికి అన్ని ఇతర నిబంధనలు, షరతులు వర్తిస్తాయి, కుటుంబ పెన్షన్ అర్హత ఉన్న జీవిత భాగస్వామి లేదా థర్డ్ పార్టీ హామీ ఇవ్వాలి.

రక్షణ దళంలో పనిచేసి రిటైరైన పెన్షనర్లు:
* ఆర్మీ, నేవీ, వైమానిక దళం, పారామిలిటరీ ఫోర్సెస్ (సిఆర్‌పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, ఐటిబిపి, మొదలైనవి), కోస్ట్ గార్డ్స్, రాష్ట్రీయ రైఫిల్స్, అస్సాం రైఫిల్స్‌తో సహా సాయుధ దళాల పెన్షనర్లు.
* పెన్షన్ చెల్లింపు ఆర్డర్‌ను ఎస్‌బిఐతో నిర్వహిస్తుండాలి.
* కనీస వయస్సు పరిమితి లేదు, రుణాన్ని ప్రాసెస్ చేసే నాటికి 76 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉండాలి.

కుటుంబ పెన్షనర్లు:
* ఫించను దారుడు మరణించిన తరువాత, అతను లేదా ఆమె పెన్షన్ పొందేందుకు అర్హత కలిగిన కుటుంబ సభ్యునికి రుణం తీసుకునేందుకు అర్హత ఉంటుంది.
* కుటుంబ పెన్షనర్ వయస్సు 76 సంవత్సరాలు మించకూడదు.

పత్రాలు:
ఐడెంటిటి ఫ్రూఫ్‌: పాస్‌పోర్ట్‌, పాన్‌కార్డ్‌, వోటర్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌, ఆధార్‌కార్డు
అడ్రస్ ఫ్రూఫ్‌: రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్‌, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్ లైసెన్స్‌, ఎలక్ట్రిసిటి బిల్లు, టెలిఫోన్ బిల్లు, స్థిరాస్తి కొనుగోలు చేసిన పత్రం/అగ్రిమెంట్‌(సొంత ఆస్తి అయుండాలి), ఆధార్ కార్డు
ఇన్‌కమ్ ఫ్రూఫ్‌: పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌


No comments

Powered by Blogger.