Latest

Loading...

postal app - ఈ యాప్ సాయంతో పోస్టల్ ఖాతా నిర్వహించడం మరింత సులభం!

  postal app - ఈ యాప్ సాయంతో పోస్టల్ ఖాతా నిర్వహించడం మరింత సులభం!

న్యూఢిల్లీ: మీరు పోస్టాఫీసులో ఖాతా తెరవాలనుకుంటున్నారా? అయితే ఒక మొబైల్ యాప్ సాయంతో డిజిటల్ సేవింగ్ అకౌంట్ తెరవవచ్చు. తపాలాశాఖ తన వినియోగదారుల కోసం ఐపీపీబీ మొబైల్ యాప్ వేదికగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. ఎవరికైతే పోస్టాఫీసులో ఖాతా ఉంటుంటుందో వారు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్(ఐపీపీబీ) సాయంతో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసుకోవడంతో పాటు ఇతర లావాదేవీలను ఇంటి నుంచే చేసుకోవచ్చు.

ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన కారణంగా పోస్టల్ ఖాతాదారులు తమ లావాదేవీల కోసం క్యూలో ఉండాల్సిన అవసరం తప్పుతుంది. అయితే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతా తెరవాలంటే ఖాతాదారునికి 18 ఏళ్లు నిండివుండాలి.
అలాగే భారతీయ పౌరుడై ఉండాలి. ముందుగా తన స్మార్ట్ ఫోనులో ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. తరువాత ఓపెన్ అకౌంట్‌పై క్లిక్ చేసి, అడిగిన వివరాలు నింపాలి. ఈ వివరాలు అందించాక మీ మొబైల్‌కు ఒక ఓటీపీ వస్తుంది.

దానిని తిరిగి తెలిపిన తరువాత చిరునామా, నామినీ లాంటి వివరాలు అందజేయాల్సివుంటుంది. అనంతరం సబ్మిట్ చేయాలి. దీంతో మీ పోస్టల్ అకౌంట్ సిద్ధమవుతుంది.


No comments

Powered by Blogger.