Smartphone Charging: మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ స్మార్ట్ టిప్స్ పాటిద్దాం.
Smartphone Charging: మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ స్మార్ట్ టిప్స్ పాటిద్దాం.
మీరు రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టి వదిలేస్తున్నారా? అలా చేయకండి, అది మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ ను దెబ్బతీస్తుందని మీరు వినే ఉంటారు. ఇలా రాత్రంతా స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టకుండా టెక్కీలు చెప్పే కొన్ని ట్రిక్కులను ఫాలో అవండి.
బ్యాటరీ దెబ్బ తినకుండా ఉండటానికి సూచనలు
ఇందులో భాగంగా మీరు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి టిప్ ఏమిటంటే.. మీరు మీ స్మార్ట్ ఫోన్ ను వంద శాతం ఛార్జ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఇలా తెలివిగా కొన్ని అప్డేట్స్ ను మీరు ఫాలో అయితే మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ స్పాన్ ను బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. ప్రస్తుతం ఫోన్లలో వాడుతున్న లిథియం-అయాన్ బ్యాటరీలు యావరేజ్ గా 500-1,000 ఛార్జ్ సైకిల్స్ సామర్థ్యంతో తయారవుతున్నాయి. మీరు ఛార్జింగ్ పెట్టిన ప్రతిసారి 80శాతం ఛార్జ్ చేస్తే సరిపోతుంది. అంతేకాదు బ్యాటరీ లైఫ్ ను పెంచాలంటే మరీ ఛార్జింగ్ పూర్తిగా డిస్ఛార్జ్ అయ్యేవరకూ అలాగే ఉపయోగించకండి. 30శాతానికి బ్యాటరీ ఛార్జింగ్ లెవెల్ పడిపోగానే ఛార్జింగ్ పెట్టడం చాలా మంచిదని రోజూ గుర్తుపెట్టుకుని ఫాలో అవండి.
5 శాతానికంటే తక్కువ ఎప్పుడూ బ్యాటరీ ఛార్జింగ్ పడిపోకుండా చూసుకుంటూ ఛార్జ్ చేసేయండి. అంతేకానీ రాత్రి పడుకోబోయేముందు ఫోన్ ఛార్జింగ్ పెడితే స్మార్ట్ ఫోన్ లోని పొటెన్షియల్ కాంపొనెంట్స్ డ్యామేజ్ అవుతాయి. బ్యాటరీ ఫుల్ అని మీకు డిస్ప్లే అయ్యాక కూడా ఛార్జ్ చేయటం చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అనేది మీ మెదడులో నాటుకుపోతే ఈ అలవాటు పోతుంది. అప్పుడు మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ మెరుగవుతుంది
45డిగ్రీలు దాటకూడదు..
గుడ్డిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే ఫోన్ ఛార్జింగ్ చేసేప్పుడు 45డిగ్రీల సెంటీగ్రేడు దాటి హ్యాండ్ సెట్ వేడెక్కకుండా జాగ్రత్త పడటం చాలా సురక్షితం. ఇక ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడేవారు చాలా మందే ఉన్నారు. మరికొందరైతే మాట్లాడుతూనే ఛార్జింగ్ పెడతారు. దీంతో మీ హ్యాండ్ సెట్ మరింత వేడెక్కుతుంది. అంతేకాదు ఛార్జింగ్ అవుతున్న మొబైల్ కు డైరెక్ట్ గా ఎండ వేడిమి తగలకుండా చూసుకోండి. ఇలా పదేపదే జరిగితే ఫోన్ వేడెక్కి, బ్యాటరీ లైఫ్ స్పాన్ తగ్గే అవకాశాలుంటాయి.
ఛార్జర్ వేరేది అస్సలు వద్దు..
మీ హ్యాండ్ సెట్ కొన్నప్పుడు కంపెనీ ఇచ్చిన ఛార్జర్ తోనే ఛార్జ్ చేయండి. ఎప్పుడూ మీ ఫోన్ తో పాటు వచ్చిన ఛార్జర్ తోనే ఛార్జ్ చేస్తే ఫోన్ బ్యాటరీ పై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువ. ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేయటానికి థర్డ్ పార్టీ యాప్ ను ఉపయోగించకండి. ఈ యాప్స్ ఫోన్ బ్యాక్ గ్రౌండ్ లో నడుస్తాయి కాబట్టి బ్యాటరీపై తీవ్ర ఒత్తిడిని పెంచుతాయి. ఫోన్ ఛార్జింగ్ చేసే సమయంలో ఫోన్ పై ఉన్న కవర్లను తీసేయండి. కొన్ని సార్లు పిన్ సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవచ్చు పైపెచ్చు ఇలాంటి సిలికాన్ కవర్స్ ఫోన్ తో పాటు కవర్ కూడా వేడెక్కెలా చేస్తాయి
No comments