సోషల్ మీడియా యూజర్లకు కేంద్రం వార్నింగ్..
Center Warning for Social Media Users
సోషల్ మీడియా యూజర్లకు కేంద్రం వార్నింగ్..
కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా యూజర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. తప్పుడు వార్తలు వ్యాపింపజేసి, హింసను ప్రేరేపించే పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో ప్రకటించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో సోషల్ మీడియాది కీలకపాత్ర అని, తప్పుడు వార్తలను షేర్ చేయడానికి, హింసను ప్రేరేపించడానికి సోషల్ మీడియాను దుర్వినియోగం చేయొద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవిశంకర్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ట్విటర్, ఫేస్ బుక్, యూట్యూబ్, లింక్డిన్ ల పేర్లను ఆయన ప్రస్తావించారు. కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్న మీరు ఇక్కడ స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు.
కానీ మీరు కచ్చితంగా భారత రాజ్యాంగాన్ని అనుసరించాలని హెచ్చరికలు జారీ చేశారు.
No comments