Latest

Loading...

Weight Loss Tips: ఈ చిట్కాలు పాటిస్తే బరువు తగ్గడం చాలా సింపుల్.. ఓసారి ట్రై చేసి చూడండి.

  Weight Loss Tips: ఈ చిట్కాలు పాటిస్తే బరువు తగ్గడం చాలా సింపుల్.. ఓసారి ట్రై చేసి చూడండి..

శరీరం ఫిట్ గా ఉండాలంటే దేహానికి తగిన వ్యాయామం ఉండాలి. క్రమ బద్ధంగా వ్యాయామం చేయడం వల్ల అధిక బరువు సమస్యను కూడా నివారించవచ్చు. అయితే కొన్నిసార్లు వ్యాయామం రెగ్యులర్ చేయలేనప్పుడు రోజూ నడక కూడా మేలు చేకూరుస్తుందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఎక్కువ సేపు నడుస్తూ తక్కువ కూర్చోవాలని యూఎస్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా తెలిపారు. ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి నడక ఉపయోగకరమైన సాధనమని తెలిపారు. నడక ద్వారా వెయిట్ లాస్ మాత్రమే కాదు.. ఇంకెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయట. అవేంటంటే..

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం.
మరణానికి దారి తీసే రోగాల్లో గుండె జబ్బులు ప్రధానమైనవి.
కాబట్టి గుండె ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. రోజుకు తగినంత సేపు నడవడం వల్ల హృద్రోగాల ప్రమాదం తగ్గి, దీర్ఘాయువు కలుగుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.

మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం..
దేహంతో పాటు మనస్సును కూడా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా నడవడం వ్యక్తి జ్ఞానాన్ని మెరుగుపరచడమే కాకుండా మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. నిరాశ, ఆందోళన లాంటి లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
స్థూలకాయాన్ని ఎదుర్కోవడం..
స్థూలకాయం వల్ల గుండెజబ్బులు, మధుమేహంతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. బరువు ఎక్కువగా ఉన్నవారు నడక ప్రారంభిస్తే బరువు సులువుగా తగ్గే అవకాశాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. స్థూలకాయాన్ని నివారించాలంటే నడక తప్పనిసరి.

వ్యాయామేతర కార్యకలాపాలు పెంచడం..
ఎప్పుడూ వ్యాయామం చేయడం కుదరదు కాబట్టి నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనిసిస్(NEAT) పెంచుకోవాలి. అంటే వ్యాయామేతర కార్యకలాపాలైన వాకింగ్, పాత్రలు కడగడం, ఇంటిని శుభ్రంచేయడం లాంటివి చేస్తూ ఎక్కువగా శరీరాన్ని కదల్చడంపై దృష్టి పెట్టాలి. బరువు తగ్గేందుకు వాకింగ్ చేస్తే మీ లక్ష్యాలను త్వరగా చేరుకోవచ్చు. నీట్ వల్ల ఈ లక్ష్యాలు మరింత త్వరగా చేరుకోవచ్చు. 30 పౌండ్ల బరువు తగ్గించే ప్రయాణంలో చివరి ఐదు పౌండ్లను కోల్పోవడంలో నీట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. వారంలో కొన్నిసార్లు వాకింగ్ కి వెళ్లడం ద్వారా 200 కేలరీలు తగ్గించే అవకాశముంది. కేవలం తక్కువ ప్రయత్నంతోనే గణనీయమైన క్యాలరీలను కరిగించవచ్చు.
నడకతో బరువు తగ్గేందుకు చిట్కాలు..
వాతావరణం అనుకూలంగా ఉందో లేదో చూడండి..మీ నడక మధ్యలో వర్షం వస్తే చాలాసార్లు విరమించుకోవాల్సి వస్తుంది. కాబట్టి నడకకు ఉత్తమ సమయం ఎప్పుడు ఉంటుందో చూడటానికి వాతావరణం అనుకూలంగా ఉందో లేదో చూసుకోవాలి. మీరు వ్యాయామం చేసే సమయానికి వర్ష సూచన ఉంటే వేరే సమయాన్ని దాని కోసం ఎంచుకోవాలి. వాతావరణం బాగుంటే అనుకున్న సమయానికే ప్రారభించవచ్చు.

నీరు తప్పనిసరి..
మీరు సుదీర్ఘ నడకకు వెళ్లాలనుకుంటే మీరు నీటిని తాగి బయలుదేరడం మంచిది. కనీసం 30 నుంచి 60 నిమిషాల ముందు రెండు కప్పుల నీరు తాగండి. మీరు మీ నడక నుంచి తిరిగి వచ్చినప్పుడు శరీరాన్ని రీ హైడ్రెట్ చేయడానికి ఓ గ్లాసు నీటిని తాగండి. ఏదైనా షుగర్ సోడాలు లేదా ఎలక్ట్రోలైట్ పానీయాలను మానుకోండి. శరీరాన్ని రీహైడ్రేట్ చేసుకోవడానికి నీరు ఉత్తమమైంది.

మంచి షూస్ వాడండి..
చాలామంది వాకింగ్ చేయడానికి చెప్పులు ఉపయోగిస్తారు. కానీ ఇది సరి కాదు. వీటికి బదులు మంచి షూస్ ని ఉపయోగించడం మంచిది. స్నీకర్లు మీరు ఎక్కువ దూరం నడిచినా కాళ్లు పెద్దగా నొప్పి పెట్టకుండా కాపాడతాయి.

సరైన వేగాన్ని ఎంచుకోండి..
వాకింగ్ మధ్యలో విరామం ఇవ్వడం వల్ల క్యాలరీలు బాగా ఖర్చవుతాయి. నడక దగ్గరకొస్తే మూడు రకాలు పేసెస్ ఉన్నాయి. స్ట్రోల్, వేగంగా నడవడం, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ వాకింగ్. స్ట్రోల్ అంటే వామప్ వాక్. మీ హృదయ స్పందన రేటును పెంచడానికి ప్రతి ఐదు నిమిషాలకు పవర్ వాక్ చేయండి. మీరు మీ నడక కోసం బయటకు వెళ్లిన ప్రతిసారీ కొన్ని సెకన్ల వరకు అత్యధిక వేగానికి మీ వాకింగ్ ని పెంచడానికి ప్రయత్నించండి. బరువు తగ్గడానికి పవర్ వాకింగ్ ఎంతగానో తోడ్పడుతుంది.

లక్ష్యాన్ని పెట్టుకోండి..
మీరు 30 నిమిషాల్లో లేదా గంటలో ఎంత దూరం నడవగలరు? మీ నడక వేగాన్ని ఆప్టిమైజ్ చేయడానికి 30 నిమిషాలకు 1.5 మైళ్లు, గంటకు 3 మైళ్లు లక్ష్యంగా ప్రయత్నించండి. మీరు పూర్తి గంట లేదా 30 నిమిషాలు నడవడానికి కట్టుబడి ఉండకపోతే మీరు చేయగలిగింది చేయండి.

వంగి నడవండి..
మీరు ఇంటిలోపల ఉంటే ట్రెడ్ మిల్ పై సాధారణంగా నడవాల్సి ఉంటుంది. అదే బయట అయితే ఎత్తుగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ క్యాలరీలను కరిగించే అవకాశం ఉంటుంది. ఇలా నడవడం వల్ల కాలి కీళ్లు ఎక్కువగా పని చేసి మీ వ్యాయామం తీవ్రతను పెంచుతాయి.

స్నేహితులతో కలిసి నడవండి..
మంచి స్నేహితులతో కలిసి నడవండ ద్వారా మీరు ట్రాక్ లో ఉండటానికి సహాయపడుతుంది. రోజువారీ నడకను మాటల ద్వారా ప్రయాణించడం వల్ల చేస్తుంది. మిమ్మల్ని ప్రేరేపించడానికి, విషయాలను మార్చడానికి వారానికి కొన్నిసార్లు మీతో కలిసి నడవడానికి వెళ్లే స్నేహితుడు, కుటుంబ సభ్యుడు లేదా సహోద్యోగిని తీసుకెళ్లడానికి ప్రయత్నించండి.

వాకింగ్ క్యాలరీ కాలిక్యులేటర్..
వాకింగ్ చేయడం ద్వారా మీరు ఎన్ని క్యాలరీలు బర్న్ చేయగలరో తెలుసుకోవాలనుందా? మీ ఫోన్ ను మీతో తీసుకెళ్లడం, వాకింగ్ యాప్స్ లో ఏదో ఒకటి డౌన్ లోడ్ చేసుకొని ఉపయోగించడం ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు.No comments

Powered by Blogger.