అప్రమత్తమైన వైద్యాధికారులు తాడేపల్లి మున్సిపల్ ఆఫీస్‌లో ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో ఎవరెవరిని కలిశారు. ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించే పనిలో పడ్డారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్స్ వాడాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. అంతా చేతులు కాలక ఆకులు పట్టుకుంటున్నారనే విమర్శిలు ఉన్నాయి. ముందే కఠిన నిబంధనలు పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని మున్సిపల్ సిబ్బంది ఆరోపిస్తున్నారు.. ఇక చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో కరోనా భయపెట్టింది. విద్యార్థులకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావటంతో స్కూల్‌కు తాళం వేసి రెడ్‌జోన్‌గా ప్రకటించారు అధికారులు. స్థానికంగా ఉండే ఇంగ్లీష్ మీడియం ప్రైవేటు పాఠశాలలో ఇద్దరు విద్యార్ధులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. విషయం తెలుసుకున్న కార్పొరేషన్ సిబ్బంది పాఠశాలలో శానిటేషన్ చేసి.. స్కూల్ ను మూశేసారు. ఇదే పాఠశాలలో గత నాలుగు రోజుల కిందట ఓ విద్యార్థినికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినా, యాజమాన్యం చర్యలు తీసుకోకపోవడంతో మరో ఇద్దరు విద్యార్థులు కరోనా బారిన పడ్డారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల తల్లి దండ్రుల ఫిర్యాదుల మేరకు పాఠశాల నిర్లక్ష్యంపై నగరపాలక కమిషనర్ పులిగుండు విశ్వనాధ్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. నగరంలోని మరో పాఠశాలలో కూడ ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో తాజాగా కరోనా సోకిన విద్యార్థుల సంఖ్య మూడుకు చేరింది. అయితే ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినా కూడా పాఠశాల విద్యాశాఖ కనీస సమాచారం కూడా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాగా కోవిడ్ నిబంధనలు పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక కమిషనర్ హెచ్చరించారు. ఏపీలో కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. వారం నుంచి నిత్యం వందకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో.. రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 8,91,004 కి చేరగా.. మరణించిన వారి సంఖ్య 7177 కి పెరిగింది. గురువారం హెల్త్ బులిటెన్ విడుదల తరువాత పరిస్థితి ఏంటన్నది చూడాలి.
ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ కరోనా కలవర పెడుతోంది. రోజు రోజుకూ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలతో అసలు కోవిడ్ నిబంధనలనే జనాలు మరిచిపోయారు. మాస్కులు పెట్టుకుని రోడ్డుపైకి వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. శానిటైజర్ లను పక్కన పెట్టేశారు. అసలు ఫిజికల్ డిస్టెన్స్ మాటేలేదు. దీంతో వైరస్ రక్కసికి మనమే డోర్ ఓపెన్ చేసినట్టు అవుతోంది.
తాజాగా తాడేపల్లిలో కరోనా కలకలం రేగింది. మున్సిపల్ ఆఫీస్‌లో 10 మంది ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణైంది. నలుగురు అధికారులు సహా 10 మందికి కరోనా రావడంతో తాడేపల్లి మున్సిపల్ ఆఫీస్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. అధికారులు, ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు.అప్రమత్తమైన వైద్యాధికారులు తాడేపల్లి మున్సిపల్ ఆఫీస్‌లో ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో ఎవరెవరిని కలిశారు. ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించే పనిలో పడ్డారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్స్ వాడాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. అంతా చేతులు కాలక ఆకులు పట్టుకుంటున్నారనే విమర్శిలు ఉన్నాయి. ముందే కఠిన నిబంధనలు పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని మున్సిపల్ సిబ్బంది ఆరోపిస్తున్నారు..
ఇక చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో కరోనా భయపెట్టింది. విద్యార్థులకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావటంతో స్కూల్‌కు తాళం వేసి రెడ్‌జోన్‌గా ప్రకటించారు అధికారులు. స్థానికంగా ఉండే ఇంగ్లీష్ మీడియం ప్రైవేటు పాఠశాలలో ఇద్దరు విద్యార్ధులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. విషయం తెలుసుకున్న కార్పొరేషన్ సిబ్బంది పాఠశాలలో శానిటేషన్ చేసి.. స్కూల్ ను మూశేసారు. ఇదే పాఠశాలలో గత నాలుగు రోజుల కిందట ఓ విద్యార్థినికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినా, యాజమాన్యం చర్యలు తీసుకోకపోవడంతో మరో ఇద్దరు విద్యార్థులు కరోనా బారిన పడ్డారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విద్యార్థుల తల్లి దండ్రుల ఫిర్యాదుల మేరకు పాఠశాల నిర్లక్ష్యంపై నగరపాలక కమిషనర్ పులిగుండు విశ్వనాధ్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. నగరంలోని మరో పాఠశాలలో కూడ ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో తాజాగా కరోనా సోకిన విద్యార్థుల సంఖ్య మూడుకు చేరింది. అయితే ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినా కూడా పాఠశాల విద్యాశాఖ కనీస సమాచారం కూడా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాగా కోవిడ్ నిబంధనలు పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక కమిషనర్ హెచ్చరించారు.
ఏపీలో కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. వారం నుంచి నిత్యం వందకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో.. రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 8,91,004 కి చేరగా.. మరణించిన వారి సంఖ్య 7177 కి పెరిగింది. గురువారం హెల్త్ బులిటెన్ విడుదల తరువాత పరిస్థితి ఏంటన్నది చూడాలి.
No comments