Latest

Loading...

బీవేర్‌: మార్చి 27-ఏప్రిల్ 4 మధ్య 2 రోజులే బ్యాంకుల సేవలు..!

న్యూఢిల్లీ: మీకు ఖాతా ఉన్న బ్యాంకులో ఏమైనా పని ఉందా? అయితే, త్వర పడండి.. ఈ వారంలోనే ఆ పని పూర్తి చేసుకోండి. లేదంటే ఏప్రిల్ మూడో తేదీ వరకు మీరు వేచి ఉండాల్సి వస్తుంది. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చేనెల నాలుగో తేదీ వరకు కేవలం రెండు రోజులు మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి.. కస్టమర్లకు సేవలందిస్తాయి. మిగతా రోజులన్నీ ప్రభుత్వ సెలవులే.

భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) బ్యాంక్ హాలీడే క్యాలెండర్ ప్రకారం ఈ నెల 27,28, 29 తేదీల్లో వరుసగా బ్యాంకులు మూతపడి ఉంటాయి.

మార్చి 27 చివరి శనివారం కావడంతోపాటు 28న ఆదివారం, 29న దేశవ్యాప్తంగా హోలీ పండుగలు జరుపుంటారు. మార్చి 30న పాట్లాలోని బ్యాంకుల శాఖలు మూసివేసి ఉంటాయి.ఒక మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు సెలవు కాకున్నా.. రోజువారీ సెలవులు ఉండవు. బ్యాంకులు తమ వార్షిక ఖాతాలను మూసివేయడంపై సిబ్బంది కేంద్రీకరిస్తారు. ఏప్రిల్ ఒకటో తేదీతోపాటు గుడ్‌ఫ్రైడే సందర్భంగా వచ్చేనెల రెండో తేదీన దేశవ్యాప్తంగా బ్యాంకులు తమ ఖాతాదారులకు సేవలు అందించలేవు..

మార్చిలో బ్యాంకు సెలవులు:

27 మార్చి: చివరి శనివారం

28 మార్చి: ఆదివారం

29 మార్చి: హోలీ పండుగ

30 మార్చి: పాట్నాలోని బ్యాంకుల శాఖలకు సెలవు

31 మార్చి: ఆర్థిక సంవత్సరం చివరి రోజు

ఏప్రిల్ నెలలో బ్యాంకు సెలవులు:

ఏప్రిల్ 1: బ్యాంకుల్లో ఆర్థిక సంవత్సర ఖాతాల మూసివేత

ఏప్రిల్ 2: గుడ్‌ఫ్రైడే

ఏప్రిల్ 5: బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

ఏప్రిల్ 13: తెలుగు సంవత్సరాది/ గుడి పడ్వా/ ఉగాది

ఏప్రిల్ 14: డడాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి/ తమిళనాడు నూతన సంవత్సర దినోత్సవం/ బిజు/ విషు పండుగ

ఏప్రిల్ 15: హహిమాచల్ ప్రదేశ్ అవతరణ దినోత్సవం/ బెంగాల్ నూతన సంవత్సర దినోత్సవం

ఏప్రిల్ 16: బోహగ్ బిహు

ఏప్రిల్ 21: శ్రీరామ నవమి

అయితే, బ్యాంకులకు అధికారిక సెలవులు ఉన్న రోజుల్లో కొన్ని రాష్ట్రాల్లో పని దినాలుగా ఉన్నాయి.ఆర్బీఐ క్యాలండర్ ప్రకారం నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు సెలవులు. గెజిటెడ్ సెలవుల్లోనూ బ్యాంకులు మూసిఉంటాయి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం మార్చి 22, 29, 30 తేదీల్లో కొన్ని రాష్ట్రాల పరిధిలో బ్యాంకులు మూసి ఉంటాయి.


 

No comments

Powered by Blogger.