Andhra Pradesh Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ కంపెనీలో టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో అర్హతతో ఉద్యోగాలు.. వివరాలివే
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. SYNERGIES CASTINGS LTDలో ఖాళీల భర్తీకి సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 300 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇందు కోసం ఈ నెల 20న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఇంటర్వ్యూల ద్వారా మొత్తం 300 ఖాళీలను భర్తీ చేయున్నారు. ట్రైనీ విభాగంలో 200 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్, సంబధిత విభాగంలో ఐటీఐ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. 2018-2020 లో పాసైన వారై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్ల మధ్యలో ఉండాలి60 శాతం మార్కులతో పాసై ఎలాంటి బ్యాక్ లాగ్స్ లేకుండా ఉన్న వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 12 వేల నుంచి రూ.13 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
Operator Trainee విభాగంలో మరో 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మెకానికల్, Metallurgy, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ తదితర విభాగాల్లో డిప్లమో చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులు 60 శాతం మార్కులతో పాసై బ్యాక్ లాగ్స్ లేకుండా ఉండాలి. 2018-20 మధ్యలో పాసై ఉండాలి. కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులని స్పష్టం చేశారు. ఈ విభాగంలో ఎంపికైన వారికి నెలకు రూ. 14 వేల వేల వేతనం చెల్లించనున్నారు.
No comments