Latest

Loading...

APSSDC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. వివరాలివే


 ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడులైంది. Pace Setters Business Solutions Pvt Ltd లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. Agent Call Centre(Collection Process) విభాగంలో 50 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏపీఎస్ఎస్డీసీ(APSSDC) అధికారిక వెబ్ సైట్ www.apssdc.in లో రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.


టెన్త్ పాస్/ఫెయిల్, ఇంటర్, ఏదైనా డిగ్రీ, బీటెక్, పీజీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఫ్రెషర్స్ తో పాటు అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చని ప్రకటనలో స్పష్టం చేశారు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల పాటు వేతనం చెల్లించనున్నారు.అభ్యర్థులకు మాతృ భాష తెలుగు రాయడం, చదవడం వచ్చి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అభ్యర్థులకు ఎలాంటి టార్గెట్ ఉండదని ప్రకటనలో స్పష్టం చేశారు.




అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు మొదటగా www.apssdc.in వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం ఈ నెల 17న GATE Degree College, Bhavani Nagar, Tirupatiలో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఇతర వివరాలకు 8309038348, 8374421195 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

No comments

Powered by Blogger.