Latest

Loading...

స్నానానికి వాడే సబ్బు ఏది నాణ్యమైనదో ప్యాక్ మీద ఉన్న దీనిబట్టి తెలుసుకోండి !!


Bath Soap: స్నానం కోసం ప్రతి ఒక్కరు సబ్బు వాడతారు. అయితే చాలామంది సబ్బులు టీవీలో యాడ్స్ చూసి, సబ్బుల నుండి వచ్చే సువాసన చూసి కొంటుంటారు. అయితే మార్కెట్లో లభ్యమయే సబ్బులలో 70% సబ్బులు మన శరీరానికి హాని చేసేవి గానే ఉన్నాయి. సబ్బుల యొక్క నాణ్యతని నిర్ణయించడానికి టీఎఫ్‌ఎం అనే పదం బాగా ఉపయోగపడుతుంది.ఒక్కసారి సరిగ్గా మీరు వాడుతున్న సబ్బు ప్యాకింగ్‌నుగమనించి చూడండి. దానిపై టీఎఫ్‌ఎం 70%, 67 %, 82 % అనిఉంది కదా అదే సబ్బు నాణ్యతను తెలియచేస్తుంది. ఇప్పుడు టీఎఫ్‌ఎంగురించి తెలుసుకుందాం.. T అంటే టోటల్ F అంటే ఫ్యాటీ M అంటే మ్యాటర్ అని దీని అర్ధం.ఈ టీఎఫ్‌ఎం శాతం ఎంత ఎక్కువగా ఉంటే ఆ సబ్బు అంత క్వాలిటీ గుణాలు కలిగి ఉంటుందని లెక్క .Test Which one is Best Bath Soap
భారతీయ ప్రమాణాల బ్యూరో(బీఐఎస్) ప్రకారం సబ్బులను 3 రకాలుగా విడదీశారు.అవి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. 76 అంతకు మించి శాతం TFM ఉన్నవి గ్రేడ్ 1 సబ్బులు. 70 నుంచి 75 వరకు TFM ఉంటే అవి గ్రేడ్ 2 సబ్బులు. 60 నుంచి 70 శాతం మధ్యలో TFM ఉన్నవి గ్రేడ్ 3 సబ్బులు గా వర్గీకరించారు. గ్రేడ్ 2, 3 సబ్బుల్లో ఫిల్లర్లు ఎక్కువ మొత్తం లో ఉంటాయి. ఇవి సబ్బు రూపంలో కలిసిపోయి ఉంటాయి. అయితే వీటిలో శరీరానికి హాని కలిగించే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సబ్బుల్లో ఆస్బెస్టాస్ లాంటి రసాయనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని వాడడం వలన చర్మానికి హాని జరుగుతుంది. ఈ గ్రేడ్ సబ్బులు నీటి లో త్వరగా కరిగిపోతాయి. నురగ ఎక్కువగా వచ్చిన కూడా వాటిని నాసిరకం సబ్బులు గానే చూడవలిసి ఉంటుంది.

రక రకాల చర్మ తత్త్వం కలిగినవారు ఉంటారు. ఎలాంటి చర్మం ఉన్నవారికైనా గ్రేడ్ 1 సబ్బే ఉత్తమం. ఈ సబ్బులు చర్మానికి మృదుత్వాన్నిఇవ్వడమే దీనికి కారణం. దీంతోపాటు మంచి శుభ్రతను కలిగిస్తాయి. అదనపు రసాయనాలు లేకుండా నే మంచి వాసనా వస్తుంటాయి . కనుక సబ్బుల యాడ్స్‌ని లేదా సువాసనని బట్టి కాకుండా సబ్బు ప్యాకెట్ పైన ఉన్న TFM శాతాన్ని చూసి మాత్రం సబ్బును కొనుగోలు చేయడం మంచిది.

No comments

Powered by Blogger.