బంగారు ఆభరణాలు మిలమిలా మెరవడానికి ఏం చేయాలంటే..?
ఇతర దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలో బంగారు ఆభరణాలను ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువనే సంగతి తెలిసిందే. బంగారు ఆభరణాలను కొంతకాలం వినియోగించిన తరువాత ఖచ్చితంగా ఆ ఆభరణాలను క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా క్లీన్ చేసుకోకపోతే బంగారంలోకి మట్టి చేరడంతో పాటు వజ్రాలు, రత్నాలు లూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంట్లోనే బంగారు ఆభరణాలను సులభంగా శుభ్రం చేయవచ్చు.బంగారు ఆభరణాలను శుభ్రం చేయడానికి మొదట ఒక గిన్నెలో వేడినీళ్లను తీసుకోవాలి. ఆ వేడి నీళ్లకు సబ్బును కొద్దిగా యాడ్ చేసి సబ్బును బాగా కలపాలి. ఆ తరువాత బంగారు ఆభరణాలను నీటిలో వేసి వాటిని అలాగే 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ఉంచాలి. ఆ తరువాత నీటిలో బంగారు ఆభరణాలను పావుగంట సమయం ఉంచి శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆభరణాలను క్లాత్ తీసుకుని తుడవాలి.
ఆభరణాలను మెల్లిగా రుద్దితే ఏ సమస్య ఉండదు. ఆభరణాలను గట్టిగా రుద్దితే మాత్రం నగలు తెగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల నగలను శుభ్రం చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ వేడినీళ్లతో లేదా చల్లనీళ్లతో బంగారం శుభ్రం చేయకూడదు. సోడియం రహిత సెల్ట్‌జర్ వాటర్ లేదా క్లబ్ సోడా ఉపయోగించి ఆభరణాలను శుభ్రం చేస్తే మరీ మంచిది.
ఇలా బంగారు ఆభరణాలను అప్పుడప్పుడూ శుభ్రం చేస్తూ ఉండటం వల్ల ఆభరణాలు తళతళా మెరిసే అవకాశం ఉంటుంది. మహిళలు ఉపయోగించే ఫర్‌ఫ్యూమ్, మాయిశ్చరైజర్, కాస్మటిక్స్ బంగారం మెరుపులను తగ్గిస్తాయి కాబట్టి అప్పుడప్పుడూ బంగారు ఆభరణాలను శుభ్రం చేసుకుంటే మంచిది.
No comments