Latest

Loading...

రెడ్‌మి అభిమానులకు శుభవార్త.. పలు ఫోన్లపై ధర తగ్గింపు


న్యూఢిల్లీ: రెడ్‌మి అభిమానులకు ఇది శుభవార్తే. ఇండియాలో రెడ్‌మి నోట్ 9 ప్రొ మ్యాక్స్, రెడ్‌మి నోట్ 9 ప్రొ, రెడ్‌మి 9ఐ, రెడ్‌మి 9ఐ ప్రైమ్ వంటి ఫోన్ల ధరలను తగ్గించింది. ఈ ఫోన్లపై గరిష్టంగా 2 వేల రూపాయల రాయితీ ప్రకటించింది. ఈ నెలాఖరు వరకు ఇది అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ఇండియా, ఎంఐ డాట్ కామ్‌తోపాటు ఈ ఫోన్లను విక్రయించే ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ తగ్గింపు అందుబాటులో ఉంటుంది.

రెడ్‌మి నోట్ 9 ప్రొ మ్యాక్స్ 6జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజీ మోడల్‌ను ఇప్పుడు రూ. 14,999కే సొంతం చేసుకోవచ్చు. 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ ఆప్షన్‌ను రూ. 17,499కి అందుబాటులో ఉంచింది. రెడ్‌మి నోట్ 9 ప్రొ 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజీ ఆప్షన్ ధరను రూ.12,999కే విక్రయానికి ఉంచింది. దీని అసలు ధర రూ. 13,999. 4జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ ఆప్షన్‌ను రూ. 15,999 నుంచి రూ. 13,999కి తగ్గించింది.

రెడ్‌మి నోట్ 9 4జీబీ ర్యామ్+64జీబీ ఆప్షన్‌ను రూ. 10,499కి, 4జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ మోడల్‌ను రూ. 12,999కి, 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ మోడల్‌ను రూ. 13,999కి జాబితా చేసింది. రెడ్‌మి 9 ప్రైమ్ 4జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజీ ఆప్షన్ మొబైల్‌ను రూ. 9,499కి, రెడ్‌మి 9ఐ 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజీ ఆప్షన్‌ను రూ. 7,999కి విక్రయానికి ఉంచింది.

 

No comments

Powered by Blogger.