Latest

Loading...

భార్య, కుమారుడి ప్రేమకు తల్లడిల్లిన ఉగ్రవాది.. కానీ లొంగిపోలేని పరిస్థితి.. కంటతడిపెట్టిస్తోన్న చిన్నారి మాటలు..

Terrorists Encounter In Kashmir: బ్యాంక్ ఉద్యోగం.. భార్య, ఇద్దరు పిల్లలతో ఎంతో సంతోషంగా గడపాల్సిన జీవితాన్ని ఆ వ్యక్తి చేతులారా నాశనం చేసుకున్నాడు. అనాలోచిత నిర్ణయంతో ఉగ్రవాదంలోకి వెళ్లాడు. తీరా భద్రతా బలగాల చేతిలో హతమై కుటుంబంలో తీరాన్ని దుఃఖాన్ని మిగిల్చాడు. సోమవారం కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వెలుగులోకి వచ్చిన ఓ అంశం అందరినీ కంటతబడి పెట్టిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. రఖిబ్‌ అహ్మద్‌ మాలిక్‌ అనే 25 ఏళ్ల వ్యక్తి బ్యాంక్‌ ఉద్యోగిగా పనిచేసేవాడు. అయితే మూడు నెలల క్రితం ఉగ్రవాదులతో చేతులు కలిపాడు. ఈ క్రమంలోనే సోమవారం జమ్మకశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లాలో భద్రతా దళాలు ఈ ఉగ్రవాదులు ఉన్న ఇంటిని చుట్టు ముట్టారు.అయితే పోలీసులు వారిపై నేరుగా కాల్పులు జరపుకుండా ముందుగా వారి కుటుంబసభ్యులతో లొంగిపోమని చెప్పించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే రఖిబ్‌ భార్య పోలీసులు ఇచ్చిన మైక్‌లో మాట్లాడుతూ.. ‘దయచేసి బయటకు వచ్చి లొంగిపో.. నీకు బయటకు రావాలని లేకపోతే.. నన్ను కాల్చేయ్‌.. మన ఇద్దరు పిల్లలు నాతో పాటే వస్తారు. బయటకు వచ్చి లొంగిపో' అంటూ వేడుకుంది. కానీ రఖిబ్‌ ఆమె మాట అంగీకరించలేదు. దీంతో రఖిబ్‌ కుమారుడితో మాట్లాడిచ్చే ప్రయత్నం చేశారు.. ఈ క్రమంలో ఆ చిన్నారి మాట్లాడిన మాటలు కంట తడి పెట్టించాయి. ‘అబ్బూజీ నేను అబ్రర్‌ను. మీరు బయటకు రండి మిమ్మల్ని ఏమి చేయరు. బయటకు రండి నాన్నా మీరు నాకు బాగా గుర్తొస్తున్నారు’ అని మాట్లాడడంతో రఖిబ్‌ గుండె తల్లడిల్లింది. బయటకు వచ్చి లొంగి పోవాలని భావించాడు. కానీ అక్కడే ఉన్న ఉగ్రవాదులు దానికి అంగీకరించలేదు. దీంతో చివరికి భ్రదత దళాలు జరిపిన దాడిలో తానూ చనిపోయి కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు. రఖిబ్‌ కుటుంబ సభ్యులను చేసిన అభ్యర్థనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘రఖిబ్‌ లొంగిపోవాలని భావిస్తున్నట్లు మాకు సమాచారం అందింది. దాంతో అతడికి ఓ అవకాశం ఇచ్చాము. కానీ మిగతా ఉగ్రవాదులు అతడిని బయటకు రావడానికి అంగీకరించలేదు. దాంతో మిగతా వారితో పాటు అతడు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు' అని తెలిపారు.


 

No comments

Powered by Blogger.