భారత్‌లో సూపర్‌బగ్ గుర్తింపు.. మరో మహమ్మారి ప్రబలే అవకాశముందని హెచ్చరిక
న్యూఢిల్లీ : భారతదేశంలో తొలిసారిగా సూపర్‌బగ్‌ను పరిశోధకులు గుర్తించారు. మారుమూల ఇసుక తీరాలలో మల్టీ డ్రగ్-రెసిస్టెంట్ జీవి ఆనవాళ్లను కనుగొన్నారు. ఈ సూపర్‌బగ్ కారణంగా రానున్న రోజుల్లో మరో ఘోరమైన మహమ్మారికి దారితీసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మైలురాయి ఆవిష్కరణలో శాస్త్రవేత్తలు కాండిడా ఆరిస్ యొక్క స్పష్టమైన ఆధారాలను పొందినట్లుగా తెలుస్తున్నది. సీ ఆరిస్ అని పిలిచే దీనిని "సూపర్‌బగ్" అని కూడా పిలుస్తారు. ఇది ప్రధాన యాంటీ ఫంగల్ చికిత్సలను నిరోధించగలదు. ఈ అధ్యయనం వివరాలు రెండు రోజుల క్రితం.. మార్చి 16 నాడు ఎంబయో పత్రికలో ప్రచురించబడింది. త్వరలోనే కాండిడా ఆరిస్.. విస్తృతంగా వ్యాప్తి చెందడానికి సరైన పరిస్థితులను కొవిడ్-19 మహమ్మారి అందిస్తుందని ఇటీవలనే ఓ నిపుణుడు హెచ్చరించారు.ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ అనురాధ చౌదరి నేతృత్వంలోని బృందం అండమాన్ దీవుల పరిసరాల్లోని ఎనిమిది సహజ ప్రదేశాల నుంచి సేకరించిన 48 మట్టి, నీటి నమూనాలను అధ్యయనం చేసింది. వీటిలో ఇసుక బీచ్‌లు, రాతి తీరాలు, టైడల్ చిత్తడి నేలలు, మడ అడవులు ఉన్నాయి. కాండిడా ఆరిస్‌ను రెండు సైట్ల నుంచి పరిశోధకులు వేరుచేశారు. ప్రజలు ఎప్పుడూ వెళ్ళని ఉప్పు మార్ష్ చిత్తడి నేల, ఎక్కువ మానవ కార్యకలాపాలతో కూడిన బీచ్ నుంచి సీ ఆరిస్ ఐసోలేట్లు అన్నీ మల్టీ-డ్రగ్ రెసిస్టెంట్లు అని గుర్తించారు. మార్ష్‌లో కనిపించే ఒక ఐసోలేట్.. ఔషధ-నిరోధకత కాదని, ఇతర ఐసోలేట్లతో పోలిస్తే అధిక ఉష్ణోగ్రతల వద్ద నెమ్మదిగా పెరుగుతుందని పరిశోధకులు గమనించారు. ఈ ఐసోలేట్ సీ ఆరిస్ యొక్క వైల్డర్ జాతి కావచ్చునని సూచిస్తున్నారు.
సూపర్‌బగ్ లక్షణాలు..
ఈ సూపర్‌బగ్ వలన కలిగే ఇన్ఫెక్షన్లు.. జ్వరం రావడానికి ముందు ఎలాంటి లక్షణాలను చూపించవు. ఔషధాలు వాడినప్పటికీ వీటి లక్షణాలు మాయం కావు. కొన్నిసార్లు తీవ్రత పెరిగి మరణానికి దారితీసే అవకాశాలు ఉంటాయి. కాండిడ్ ఆరిస్ గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశించే ముందు చర్మంపై జీవించి ఉంటుంది. రక్తప్రవాహంలో ప్రవేశించిన తర్వాత తీవ్రమైన అనారోగ్యానికి కారణమై సెప్సిస్‌కు దారితీస్తుంది. ఈ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 11 మిలియన్ల మందిని చంపుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది.
సూపర్‌బగ్ విస్తరణకు కారణలు..
ఈ కాండిడ్ ఆరిస్ ఎలా వ్యాపిస్తుంది అనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు ఒక రహస్యంగానే ఉన్నది. వాతావరణ మార్పుల కారణంగా పెరిగిన ఉష్ణోగ్రతలు కాండిడ్ ఆరిస్ వ్యాప్తికి కారణమవుతాయని పరిశోధకులు గతంలో ఊహించారు. తద్వారా ఫంగస్ మానవులకు అంటుకోవడానికి వీలు కలుగుతుంది. దీని సాధారణ శరీర ఉష్ణోగ్రత సాధారణంగా చాలా వేడిగా ఉంటుంది. ఈ ఇన్‌ఫెక్షన్ ప్రపంచంలోని అన్ని మూలలకు చేరుకున్నది. అక్కడ ఇది "అడవి మంటలా వ్యాప్తి చెందుతోంది" అని సన్ పత్రిక వెల్లడించింది.
పూర్వపు జాడలు ఉన్నాయా..?
కాండిడ్ ఆరిస్ ఒక దశాబ్దం క్రితం ప్రపంచంలోని దవాఖానల్లో కనుగొన్నట్లు తెలుస్తున్నది. ఈ మర్మమైన "సూపర్‌బగ్" ఒక ఫంగస్. ఈ ఫంగస్ 2009 లో జపాన్‌లోని ఒక రోగిలో మొదటిసారి కనుగొన్నారు. బ్రిటన్‌లో 2019 వరకు సుమారు 270 మందికి ఈ ఇన్‌ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణ అయిందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ నుండి వచ్చిన డాటాను నివేదిక పేర్కొన్నది. ఫలితంగా ఎనిమిది మంది మరణించారు. అయితే, ఈ మరణాలను దీని కారణంగానే అని చెప్పడానికి ఆధారాలు లేవు. కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని శాస్త్రవేత్తలు ఇప్పుడు తదుపరి ప్రాణాంతక మహమ్మారికి కారణమయ్యే వ్యాధికారక కణాలను గుర్తించే పరిశోధనలపై దృష్టిసారించారు.
No comments