Latest

Loading...

పోస్టాఫీస్ అదిరే స్కీమ్... నో రిస్క్.. కచ్చితమైన లాభం


చేతిలో డబ్బుతోనే మళ్లీ డబ్బులు సంపాదించొచ్చు. దీనికి మంచి రాబడి అందించే ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్‌లో డబ్బులు పెట్టాలి. రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావిస్తే.. పోస్టాఫీస్ స్కీమ్స్ బెస్ట్ అని చెప్పొచ్చు. వీటిల్లో డబ్బులు పెడితే ఆకర్షణీయ రాబడి పొందొచ్చు.డబ్బులు పోతాయనే రిస్క్ ఉండదు. పోస్టాఫీస్ అందించే స్కీమ్స్‌లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఒకటి ఉంది. ఇందులో చేరితో ప్రతి నెలా చేతికి డబ్బులు వస్తాయి. మీరు పెట్టిన డబ్బుకు కేంద్ర ప్రభుత్వపు హామీ ఉంటుంది. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌పై ప్రస్తుతం 6.6 శాతం వడ్డీ లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను సమీక్షిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మీరు పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో చేరితే రూ.9 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు.జాయింట్ అకౌంట్‌కు ఇది వర్తిస్తుంది. అదే సింగిల్ అకౌంట్ అయితే రూ.4.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. మీరు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి రూ.9 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలా మీకు రూ.4950 వస్తాయి. మీరు మీకు దగ్గరిలోని పోస్టాఫీస్‌కు వెళ్లి మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో చేరొచ్చు. రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి. ఇంకా ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్లు అసవరం అవుతాయి. సింగిల్‌గా లేదా జాయింట్‌గా ఖాతా తెరవొచ్చు.
 

No comments

Powered by Blogger.