Latest

Loading...

ఎండాకాలం తీసుకోవాలిసిన జాగ్రత్తలు...


ఎండాకాలం ప్రారంభం నుండే ఎండ ప్రతాపం రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతోంది. ఉదయం 8 గంటల నుండే వేడి వాతావరణం కనపడుతుంది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఒంట్లో నీళ్లతో పాటు ఓపికనూ పీల్చేసే సీజన్ ఇది. ఠారెత్తించే ఎండ. తట్టుకోలేని వేడి. భరించలేనంత ఉక్కబోత. చెప్పలేనంత నీరసం. వీటన్నింటి నుంచి గట్టెక్కాలంటే సరైన కేర్ తీసుకోవాల్సిందే. ఎండ నుంచి చర్మాన్ని, జుట్టుని కాపాడుకోవాల్సిందే. ఎండ దెబ్బ తగలకుండా ఉండాలంటే ముందే జాగ్రత్త పడాలంటున్నారు డాక్టర్లు. వేసవిలో వచ్చే సమస్యల్లో వడదెబ్బ ఒకటి. శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి అమాంతంగా బాడీ టెంపరేచర్ పెరిగిపోతే వచ్చే సమస్యే వడదెబ్బ. అందుకే ఈ సీజన్‌లో వేడిని నెగ్లెక్ట్ చేయకూడదు.వేసవి తాపాన్ని తీర్చేవి కచ్చితంగా నీళ్లే. నీళ్లకు మించింది మరొకటి లేదు, గంటగంటకూ నీళ్లు తాగాలి. అయితే వేడి ఎక్కువగా ఉందని మరీ చల్లగా ఉండే నీళ్లు తాగకూడదు. తియ్యదనం కోసం కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, ఆర్టిఫీషియల్ జ్యూస్‌లూ తాగకూడదు.

టీ, కాఫీలు కూడా తగ్గించాలి. ఇవి ఎక్కువగా తాగడం వల్ల దాహం తీరదు. పైగా మరింత పెరుగుతుంది. వీటిలో ఉండే కెమికల్స్, చక్కెర ఎండదెబ్బకు గురయ్యే అవకాశాలను పెంచుతాయి. అందుకే, వేసవిలో చెమట రూపంలో వెళ్లిపోయిన నీటిని భర్తీ చేసే డ్రింక్సే ఎక్కువగా తాగాలి. లేదంటే డీ హైడ్రేషన్‌ బారిన పడే ప్రమాదం ఉంది. కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, మజ్జిగ, లస్సీ, పళ్ల రసాలు, నిమ్మ రసాలు వంటి సోడియం, పొటాషియం ఉండే డ్రింక్స్ తాగితే లాభం ఎక్కువగా ఉంటుంది.

 

No comments

Powered by Blogger.