బిగ్ బ్రేకింగ్: కరోనా సెకండ్ వేవ్ పై కీలక కామెంట్లు చేసిన ప్రధాని మోడీ..!!
Modi : ఇటీవల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని మోడీ కరోనా సెకండ్ వేవ్ పై కీలక కామెంట్లు చేశారు. ప్రపంచంలో చాలా దేశాలలో సెకండ్ వేవ్ స్టార్ట్ అయిందని ఇండియాలో కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాబట్టి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంతో కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఏ ప్రాంతాల్లో అయితే కేసులు పెరుగుతున్నాయో అక్కడ మైక్రో కంటెంట్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
Modi sensational Comments on corona second wave..!!
అదేవిధంగా కరోనా టీకా కేంద్రాలను కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సెకండ్ వేవ్ అంటూ ప్రజలను ఎక్కువగా భయభ్రాంతులకు గురి చేయకూడదని సీఎం లకు సూచించారు.అతి విశ్వాసంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో అందరూ కలసికట్టుగా పనిచేయాలని ..ప్రజలకు మంచి పాలన అందించాలని పేర్కొన్నారు. దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఊహించని విధంగా కేసులు పెరిగిపోయాయని, దాదాపు దేశ వ్యాప్తంగా 70 జిల్లాలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని..విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్రమత్తంగా ఉండాలని మోడీ తెలిపారు.
No comments