దుర్వాసనను పోగొట్టే.. సహజ సిద్దమైన చిట్కాలు ఏంటో తెలుసా..?
ప్రస్తుత కాలంలో కరోనా వచ్చిన తర్వాత చాలామంది పారిశుధ్యంపైన ఎన్నో జాగ్రత్తలు వహిస్తున్నారు . ఇక అందులో మరీ ముఖ్యంగా మన శరీరాన్ని మనం శుభ్రంగా ఎప్పటికప్పుడు ఉంచుకోవాలి . అందులో ఒకటి నోరు కూడా . నోరు ఎప్పుడైతే శుభ్రంగా లేకుండా ఉంటుందో, అప్పుడు నోటి నుంచి దుర్వాసన రావడం మొదలు పెడుతుంది . ఈ దుర్వాసన వల్ల నలుగురిలో మాట్లాడలేకపోవడం, కలవలేకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు . సాధారణంగా ఈ నోటి దుర్వాసనకి చాలా కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది పళ్లను శుభ్రం గా ఉంచుకోకపోవడమే.నోరు బాగుంటే శరీరం ఆరోగ్యం బాగుంటుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి. మనం తిన్న ఆహారం పళ్ళ సందుల్లో ఇరుక్కుపోయి, దానిపై బ్యాక్టీరియా పేరుకుపోతుంది.తద్వారా నోరు దుర్వాసన వస్తుంది.అందుకే ప్రతి ఆరు నెలలకు ఒకసారైనా దంత వైద్యుడిని సంప్రదించాలని చెబుతుంటారు.ఇక అదే విధంగా మన ఇంట్లో దొరికే పదార్థల ద్వారా నోటి దుర్వాసన ను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.
1). పైనాపిల్ జ్యూస్:
చాలామంది పైనాపిల్ జ్యూస్ తాగితే నోటి దుర్వాసన తగ్గిపోతుందని నమ్ముతారు. దీని వెనకాల సరి అయిన నిరూపణ సరిగ్గా లేకపోయినప్పటికీ అన్నం తిన్న తర్వాత ఒక గ్లాస్ పైనాపిల్ జ్యూస్ తాగితే సరిపోతుంది.
2). పాలు:
పాలలో ఉండే పోషక గుణాలు చెడువాసన దూరం చేస్తాయి. ఉల్లిపాయ, వెల్లుల్లి గల ఆహారాలను తీసుకుని ఒక గ్లాసు పాలు తాగితే చెడువాసన దూరమవుతుంది.
3). పెరుగు:
పెరుగులో లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది.చెడు వాసనను చంపేస్తుందనీ, ఒక పరిశోధన ప్రకారం కొంతమంది పై, కొన్ని రోజులు పరిశోధనలు జరిపి ఆ విషయం కనుక్కున్నారు.
4). నీళ్లు:
నోరు ఎండిపోవడం కూడా దుర్వాసనకి కారణం అవుతుంది. నాలుక మీద లాలాజలం ఉత్పత్తి కాకపోతే నోరు దుర్వాసనకి గురవుతుంది. అందుకే నోటిని ఎప్పుడూ తేమగా ఉంచడానికి కావలసినది నీళ్లు ఖచ్చితంగా తాగాల్సి ఉంటుంది.
5). సోంపు:
అన్నం తిన్న తరువాత సరిగ్గా జీర్ణ అవ్వాలని సోంపు తినే అలవాటున్న వారు చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు.ఎందుకంటే నోటి దుర్వాసన సోంపు దూరం చేస్తుంది. అందులో ఉండే సువాసన నోటి దుర్వాసనను దూరం చేస్తుందట.
అంతేకాకుండా ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వాడకం తగ్గించాలి. సల్ఫర్ శాతం ఉండడం వలన నోటి దుర్వాసనకు కారణం అవుతుంది.
No comments