Latest

Loading...

వేసవిలో వచ్చే గ్యాస్ సమస్యలకు ఇలా చెక్ పెట్టండి..!


వేసవిలో మనకు సహజంగానే గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే.. మనం తిన్న ఆహారం ఈ కాలంలో త్వరగా జీర్ణమవడంతోపాటు, జీర్ణాశయంలో మాటి మాటికీ గ్యాస్ ఉత్పన్నమవుతుంటుంది. దీంతో మనకు ఇబ్బందులు వస్తుంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే ఈ సీజన్‌లో వచ్చే గ్యాస్‌, అసిడిటీ సమస్యలను నుంచి చాలా తేలిగ్గా బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే...

వేసవిలో డీహైడ్రేషన్ సమస్య వల్ల కూడా మనకు గ్యాస్ వస్తుంటుంది. కనుక నిత్యం తగిన మోతాదులో నీటిని తాగాలి. దీని వల్ల జీర్ణాశయంలో ఉండే యాసిడ్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. ఫలితంగా గ్యాస్ రాకుండా ఉంటుంది.

భోజనం చేసిన తరువాత కనీసం 30 నిమిషాల పాటు కూర్చుని ఉండాలి.పడుకోకూడదు. లేదంటే గ్యాస్ సమస్యలు వస్తాయి.

గ్యాస్ సమస్యను తొలగించడంలో అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. గ్యాస్ బాగా ఉంటే అల్లం టీ తాగాలి. లేదా చిన్న అల్లం ముక్కను అలాగే నమిలి మింగాలి. దీంతో గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

పుదీనా రసం, నిమ్మరసం, బేకింగ్ సోడా నీటి మిశ్రమాలలో దేన్ని తాగినా గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు.

దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులలో దేన్నయినా తింటే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

 

No comments

Powered by Blogger.