వైఎస్‌ఆర్ అనుచరుడు సూరీడుపై అల్లుడి దాడి
హైదరాబాద్: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడు సూరీడు మీద దాడి కలకలం రేపుతోంది. సూరీడు అల్లుడు డా.సురేంద్రనాథ్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని సూరీడు నివాసంలోకి బలవంతంగా ప్రవేశించి క్రికెట్ బాట్‌తో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. గతేడాది కూడా సూరీడు మీద సురేంద్రనాథ్ దాడి చేశాడు. భార్యను వేధింపులకు గురి చేస్తుండడంతో గతంలోనే సురేంద్రనాథ్ రెడ్డి మీద గృహహింస కేసు నమోదు అయ్యింది. ఆ కేసులను ఉపసంహరణ చేసుకోవడం లేదనే కక్ష్యతో మామ సూరీడును హత్య చేసేందుకు సురేంద్రనాథ్ రెడ్డి యత్నించాడు. సూరీడు కుమార్తె గంగా భవానీ ఫిర్యాదుతో జూబ్లిహిల్స్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
No comments