Latest

Loading...

మీ ఫోన్ కి వచ్చే మెసేజ్‌లు, ఓటీపీలు ఇలా హ్యాక్ అవుతాయ్.. జస్ట్ చిల్లర పడేస్తే..


 

అపరిచిత వ్యక్తులకు మీ ఓటీపీ వివరాలను చెప్పకండి. గోప్యతను పాటించండి అంటూ తరచూ భద్రతా పరమైన హెచ్చరికలు సైబర్ క్రైం అధికారులు ఇస్తూనే ఉంటారు. అయినప్పటికీ హ్యాకర్ల దాడుల వల్ల గోప్యత వివరాలు బహిర్గతమవుతూనే ఉన్నాయి. తాజాగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు సరికొత్త సమస్య ఎదురవుతోంది. సెల్ ఫోన్ కి వచ్చే సందేశాల ద్వారా సమాచారాన్ని తస్కరిస్తున్నారు. ఈ మేసేజులను పంపినందుకుగాను ఎస్ఎంఎస్ దారి మళ్లింపు సంస్థలకు తగిన పారితోషికం ఇస్తారు. అయితే ఇది లక్షల్లో ఉంటుందనుకుంటే పొరపాటే. వారికి ఇచ్చే మొత్తం కేవలం రూ.1160(16 డాలర్లు) మాత్రమే. ఇంత తక్కువ మొత్తానికే మీ సమాచారం సైబర్ కేటుగాళ్ల చేతులోకి వెళ్లిపోతుంది. ఎస్ఎంస్ కోడ్స్ లేదా లాగిన్ మెసేజుల ద్వారా వినియోగదారుల సమాచారాన్ని వారు తస్కరిస్తున్నారు.ఈ ఎస్ఎంఎస్ దారి మళ్లింపు సేవలను అందించే సంస్థలు, టెలికాం కంపెనీలకు చెందిన ఉద్యోగులతో కలిసి ఈ అదృశ్య సైబర్ దాడి జరుగుతోందని మదర్ బోర్డ్ అనే సంస్థ ఓ నివేదికలో ప్రకటించింది. ఫలితంగా వ్యక్తిగత సమాచారం సులభంగా సైబర్ నేరస్థుల చేతుల్లోకి వెళ్తుందని తెలిపింది.

"ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా సైబర్ క్రైం పద్ధతి మారింది. ఇక్కడ నేరస్థులు వ్యక్తుల ఫోన్ నెంబర్లను లక్ష్యంగా చేసుకొని వారి బ్యాంక్ ఖాతాను హరించడానికి లేదా వారి డిజిటల్ జీవితాలను చిక్కుల్లో పడేసేందుకు వీటిని సేకరిస్తున్నారు" అని సోమవారం నాడు మదర్ బోర్డ్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ సేవలను ఉపయోగించి దాడులు చేసే వారు ఇన్ కమింగ్ సందేశాలను అడ్డగించలేరు. కానీ వాటికి రిప్లై ఇవ్వగలరు. అయితే ఈ భద్రతా పరమైన ముప్పును కనుగొనడం పెద్ద కష్టమేమి కాదని యూఎస్ సెనేటర్ రాన్ వైడెన్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఎస్ఎంఎస్ సేవలను మిస్ యూజ్ చేయడానికి అనేక ఇతర పద్ధతులు ఉన్నాయి. వాటిలో సిమ్ మార్పిడి కూడా ఒకటి. అయితే సిమ్ మార్పిడి ద్వారా మీ సెల్ ఫోన్ నెట్ వర్క్ ను పూర్తిగా డిస్ కనెక్ట్ చేసినట్లయితే మీరు దాడికి గురయ్యారో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. అయితే ఈ ఎస్ఎంఎస్ దారి మళ్లింపు తో మీరు సైబర్ దాడిని చాలా ఆలస్యంగా గుర్తిస్తారు. ఈ సమయానికి హ్యాకర్లు మీ ఖాతా, వ్యక్తిగత ఆర్థిక వివరాలను దొంగిలిస్తారు. భద్రతకు సంబంధించి వీలైతే టూ-ఫ్యాక్టర్ అథెంటీకేషన్ కోసం ఎస్ఎంఎస్ లను తప్పించాలి. Google Authenticator లేదా Authy వంటి యాప్స్ ఉపయోగించడం మంచిదని ఈ నివేదిక పేర్కొంది. అంతర్గతంగా నిర్మితమైన 2FA సపోర్ట్ చేసే 1 పాస్వర్డ్ లేదా ఉచితంగా మేము సిఫార్సు చేసే వాటిని వినియోగించాలని స్పష్టం చేసింది.

No comments

Powered by Blogger.