జాతీయస్థాయి పోటీలకు విస్సన్నపేట చిన్నారులు
గురువు సత్యతో జాతీయ పోటీలకు ఎంపికైన చిన్నారులు
విస్సన్నపేట, న్యూస్‌టుడే: యుద్ధవిద్యగా అంతర్జాతీయ స్థాయిలో పేరు గాంచిన పెన్‌కాక్ సిలాట్ జాతీయస్థాయి పోటీలకు విస్సన్నపేటకు చెందిన పలువురు చిన్నారులు ఎంపికయ్యారు. గత ఏడాది ఫిబ్రవరిలో విస్సన్నపేటలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించగా విస్సన్నపేటకు చెందిన 10 మంది ఉత్తమ ప్రతిభ కనబరిచి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరితోపాటు కాకినాడ తదితర ప్రాంతాలకు చెందిన మరో ముగ్గురు మన రాష్ట్రం నుంచి ఎంపికయ్యారని పెన్‌కాక్ సిలాట్ విద్య గురువు డీడీ.సత్య తెలిపారు. ఈనెల 24 నుంచి 27వ తేదీ వరకు జాతీయస్థాయిలో కశ్మీర్ ప్రాంతంలోని శ్రీనగర్‌లో జరిగే పోటీలకు హాజరయ్యేందుకు వీరు సిద్ధమవుతున్నట్లు ఆయన చెప్పారు
No comments