Latest

Loading...

Cancer symptoms - కేన్సర్‌ ప్రాథమిక లక్షణాలు ఏంటో తెలుసా?

 Cancer symptoms - కేన్సర్‌ ప్రాథమిక లక్షణాలు ఏంటో తెలుసా?

గడ్డిమోపులో పడ్డ చిన్న నిప్పు రవ్వను గమనించకుండా నిర్లక్ష్యం చేస్తే చివరికి ఏమవుతుందో... శరీరానికి సోకిన క్యాన్సర్‌ను సకాలంలో గుర్తించకపోతే అదే అనర్థం జరుగుతుంది. అందుకే కొన్ని లక్షణాలను బట్టి క్యాన్సర్‌ని మొదట్లోనే గుర్తించగలిగితే ఎంతో ప్రమాదాన్ని నివారించగలుగుతాం. క్యాన్సర్‌ లక్షణాలు అవయవానికీ అవయవానికీ మారిపోతాయి. అయితే క్యాన్సర్‌ రోగులందరిలో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యవంతుల్లోనూ అప్పుడప్పుడూ కనిపించేవి కావడంతో వాటిని గుర్తించడం కష్టం. తల నుంచి శరీరం కింది భాగం వరకు ఆయా అవయవ భాగాల్లో తొలి దశలోనే క్యాన్సర్‌ను గుర్తించేందుకు కొన్ని ప్రాథమిక లక్షణాలివి.

గుర్తించేందుకు కొన్ని సాధారణ అంశాలు...
అకారణంగా ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఎడతెరిపి లేకుండా దగ్గు లింఫ్‌ గ్లాండ్స్‌ (బాహుమూలాల్లో, గజ్జల్లో, గొంతుదగ్గర) వాపు (కొన్నిసార్లు కొన్ని అవయవాలలో మాత్రమే) అవయవాలనుంచి రక్తస్రావం... ఇవి సాధారణంగా కనిపించే లక్షణాలు. అయితే ఈ లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌వే కానక్కర్లేదు. వీటిలో ఏదో ఒకటి కనిపించిన మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరమూ లేదు. కానీ ప్రాథమిక చికిత్స తీసుకున్న తర్వాత కూడా, అదేపనిగా ఇబ్బంది పడుతుంటే మాత్రం ఒకసారి డాక్టర్‌చేత పరీక్ష చేయించుకుని అది క్యాన్సర్‌ కాదని నిర్ధారణ చేసుకొని నిశ్చింతగా ఉండాలి.


No comments

Powered by Blogger.