DSSSB Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... 1809 ఉద్యోగాలకు అప్లై చేయండిలా
DSSSB Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... 1809 ఉద్యోగాలకు అప్లై చేయండిలా
నిరుద్యోగులకు శుభవార్త. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్-DSSSB ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1809 ఖాళీలను ప్రకటించింది. జూనియర్ స్టెనోగ్రాఫర్, ల్యాబ్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ కెమిస్ట్, జూనియర్ ఇంజనీర్, పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్, సైంటిఫిక్ అసిస్టెంట్ లాంటి పోస్టులున్నాయి. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీలో ఢిల్లీ జల్ బోర్డ్, ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2021 మార్చి 15న ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2021 ఏప్రిల్ 14 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://dsssb.delhi.gov.in/ లేదా https://dsssbonline.nic.in/ వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు.
వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి.
DSSSB Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 1809
టెక్నికల్ అసిస్టెంట్- 32
ల్యాబరేటరీ అటెండెంట్- 66
అసిస్టెంట్ కెమిస్ట్- 40
అసిస్టెంట్ ఇంజనీర్ ఈ అండ్ ఎం- 14
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ లేదా మెకానికల్)- 62
డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్ 1- 16
పర్సనల్ అసిస్టెంట్- 84
ఫార్మసిస్ట్- 82
అసిస్టెంట్ డైరెక్టర్- 3
అసిస్టెంట్ గ్రేడ్ 2- 28
జూనియర్ స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్)- 13
జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్- 31
సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ- 6
సెక్యూరిటీ సూపర్‌వైజర్- 9
అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్- 158
కార్పెంటర్ 2 క్లాస్- 4
అసిస్టెంట్ ఫిల్టర్ సూపర్‌వైజర్- 11
ప్రోగ్రామర్- 5
టీజీటీ (చెవిటి & మూగ)- 19
స్పెషల్ ఎడ్యుకేటర్ ప్రైమరీ- 1126
DSSSB Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2021 మార్చి 15
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 14
విద్యార్హతలు- పోస్టుల వారీగా విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
వయస్సు- 18 నుంచి 30 ఏళ్లు
దరఖాస్తు ఫీజు- రూ.100
ఎంపిక విధానం- ఒక దశ లేదా రెండు దశల రాతపరీక్ష, స్కిల్ టెస్ట్
DSSSB Recruitment 2021: అప్లై చేయండి ఇలా
ముందుగా https://dsssb.delhi.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో దరఖాస్తు లింక్ పైన క్లిక్ చేయాలి.
పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి.
ఆ తర్వాత విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.
తర్వాతి స్టెప్‌లో డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
చివరగా దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.
No comments