Latest

Loading...

Earthquake: భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 4.2 నమోదు.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు


Earthquake: పలు రాష్ట్రాలో ఈ మధ్యకాలంలో భూప్రకంపనలు ఎక్కువైపోయాయి. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో భూకంపం చోటు చేసుకుంటుంది. తాజాగా నాగలాండ్‌లో ఆదివారం భూకంపం చోటు చేసుకున్నట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ పేర్కొంది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.2గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా, భూకంప కేంద్రాన్ని మొకోక్చుంగ్‌కు ఆగ్నేయ దిశలో 77కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే భారీ శబ్దాలతో భూప్రకంపనలు రావడంతో ప్రజలు తమ తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అలాగే ఈనెల 10న కూడా భూకంపం సంభవించగా, మళ్లీ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

కాగా, శనివారం జపాన్‌లో కూడా భారీ భూకంపం సంభవిచింది.మియాగి ప్రాంతంలో వచ్చిన భూప్రకంపనలతో భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.దీంతో ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.0గా గుర్తించారు అధికారులు రాజధాని టోక్యో నగరం సైతం ప్రకంపనల ప్రభావానికి లోనైంది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు.పలు అక్కడక్కడ భవనాలు దెబ్బతిన్నట్లు తెలిపారు. అయితే భూకంపం భారీ స్థాయిలో ఉండడంతో అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

 

No comments

Powered by Blogger.