Latest

Loading...

Health -ఈ టీ తాగితే దగ్గు చిటికెలో మాయం...

 Health -ఈ టీ తాగితే దగ్గు చిటికెలో మాయం...


మన ఇంటి ముందు ఉండే తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే ఆయుర్వేదంలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలోనూ తులసి ముఖ్య భూమిక పోషిస్తుంది. ముఖ్యంగా తులసి టీని రోజూ తాగడం ద్వారా గొంతు సమస్యల నుంచి ఆస్తమా వంటి ఎన్నో వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన తులసి టీతో కలిగే ప్రయోజనాలేంటో ఒకసారి చూద్దాం.


శ్వాసకోశ సమస్యలు


జలుబు, దగ్గు వంటి గొంతు సమస్యల నుంచి ఆస్తమా వరకు అన్నింటికీ తులసి దివ్యౌషధంలా పనిచేస్తుంది. వ్యాధి నిరోధకతను పెంచడమే కాకుండా శ్వాసక్రియను మెరుగు చేస్తుంది.

తులసి టీ తాగడం ద్వారా పొడి దగ్గు నుంచి క్షణాల్లో ఉపశమనం పొందవచ్చు.


ఒత్తిడిని తగ్గిస్తుంది


తులసి టీ తాగడం ద్వారా కార్టిసల్ అనే హార్మోన్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. కార్టిసల్ హార్మోన్‌ను స్ట్రెస్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఈ హార్మోన్ లెవల్స్ పెరిగినప్పుడు మనలో స్ట్రెస్ కూడా పెరుగుతుంది. తులసి టీని తాగడం ద్వారా ఈ హార్మోన్ స్థాయులు నియంత్రణలో ఉంటాయి కాబట్టి ఒత్తిడికి కూడా తగ్గుతుంది.


చక్కెరస్థాయిల నియంత్రణ


సాధారణ టీలతో పోలిస్తే తులసి టీ తాగినప్పుడు రక్తంలోని చక్కెరస్థాయిలు అదుపులో ఉంటాయి. ప్రతిరోజూ తులసి టీ తాగడం ద్వారా జీవక్రియ మెరుగుపడుతుంది. ఆహారంలోని కొవ్వు, పిండి పదార్థాలను సులభంగా జీర్ణం కావడంలో సహాయపడుతుంది. దీనివల్ల రక్తంలోని చక్కర తొందరగా శక్తిగా మారిపోతుంది. తద్వారా రక్తంలో చక్కెర నిల్వలు పెరగకుండా నియంత్రణలో ఉంటాయి.


దంత సంరక్షణ


తులసి టీలో యాంటీ మైక్రోబయాల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి నోటిలోని హానికర బ్యాక్టీరియాను, సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి. దంతాలు ధృడంగా, ఆరోగ్యంగా ఉంటాయి. నోటి నుంచి దుర్వాసన కూడా రాదు.


తులసి టీని ఎలా చేయాలి?


- అప్పుడే తెంపిన తులసి ఆకులను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి


- తర్వాత ఒక గిన్నెలో నీరు తీసుకొని అందులో తులసి ఆకులను వేయాలి.


- తులసి ఆకులు వేసిన నీటిని తక్కువ మంటతో పది నిమిషాల పాటు మరగబెట్టాలి.


- గిన్నెపై మూత పెట్టి నీటిని వేడి చేయడం ద్వారా తులసి ఆకుల సారం మొత్తం నీటిలోకి దిగుతుంది.


- ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారేంత వరకు పక్కన పెట్టాలి.


- ఆ మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే వడకట్టి తాగేయాలిజ


- కేవలం తులసి ఆకులే కాకుండా యాలకులు, అల్లం, మిరియాలు వంటివి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు.


- తులసి టీని తేనెలో కలిపి తీసుకున్న చక్కటి ఫలితం ఉంటుంది.


No comments

Powered by Blogger.