Latest

Loading...

Home Loan: మొదటిసారి హోమ్ లోన్ తీసుకుంటున్నారా? రూ.5,00,000 వరకు ప్రయోజనం పొందండి ఇలా

 

సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. ఇందుకోసం ఏళ్ల పాటు శ్రమించి పోగుచేసిన డబ్బుతో వాటిని కొనుగోలు చేస్తారు. మరికొందరు తమ దగ్గరున్న కొంత మొత్తానికి హోం లోన్ తీసుకొని ఆ మొత్తాన్ని చేర్చి ఇల్లు కొంటుంటారు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం మొదటి సారి గృహాన్ని కొనుగోలు చేసేవారు వివిధ విభాగాల కింద రూ.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ పొందాలంటే వీటి గురించి సమగ్రంగా అవగాహన కలిగి ఉండాలి. మొదటి సారి గృహాన్ని కొనుగోలు చేసేవారిలో చాలా మంది కొనుగోలు చేసిన తర్వాత గృహ రుణంపై పొందగలిగే ఆదాయపు పన్ను ప్రయోజనాలు గురించి ఆలోచిస్తారు. కొన్నిసార్లు గందరగోళంలో పడతారు. మీరు ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటే గృహం రుణంపై కొన్ని పన్ను ప్రయోజనాలు పొందడానికి మీకు అర్హత ఉంది.సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. ఇందుకోసం ఏళ్ల పాటు శ్రమించి పోగుచేసిన డబ్బుతో వాటిని కొనుగోలు చేస్తారు. మరికొందరు తమ దగ్గరున్న కొంత మొత్తానికి హోం లోన్ తీసుకొని ఆ మొత్తాన్ని చేర్చి ఇల్లు కొంటుంటారు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం మొదటి సారి గృహాన్ని కొనుగోలు చేసేవారు వివిధ విభాగాల కింద రూ.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ పొందాలంటే వీటి గురించి సమగ్రంగా అవగాహన కలిగి ఉండాలి. మొదటి సారి గృహాన్ని కొనుగోలు చేసేవారిలో చాలా మంది కొనుగోలు చేసిన తర్వాత గృహ రుణంపై పొందగలిగే ఆదాయపు పన్ను ప్రయోజనాలు గురించి ఆలోచిస్తారు. కొన్నిసార్లు గందరగోళంలో పడతారు. మీరు ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటే గృహం రుణంపై కొన్ని పన్ను ప్రయోజనాలు పొందడానికి మీకు అర్హత ఉంది.ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్-80సీ, సెక్షన్ -24, సెక్షన్-80ఈఈఏ కింద ప్రయోజనం పొందవచ్చు. చట్టంలోని ఈ విభాగాల ద్వారా ఏటా రూ.5 లక్షల హోంలోన్ బెనిఫిట్ ఉంటుంది.

సెక్షన్-80సీ కింద పన్ను ప్రయోజనం

సెక్షన్-80సీ కింద కొనుగోలుదారుడు హోం లోన్ ప్రిన్సిపల్, స్టాంప్ డ్యూటీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందవచ్చు. అయితే ఈ ఆదాయపు పన్ను ప్రయోజనం పొందడానికి కొనుగోలుదారులు ఆస్తిని స్వాధీనం చేసుకున్న ఐదేళ్ల వరకు విక్రయించలేరు.

సెక్షన్-84 కింద పన్ను మినహాయింపు

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్-24 కింద మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసివారు రుణ వడ్డీ చెల్లింపు విభాగం కింద రూ.2 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ పన్ను మినహాయింపు పొందాలంటే ఆదాయపు పన్ను కట్టే వ్యక్తి లేదా వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆ ఇంట్లో నివసించాలి.

సెక్షన్-80ఈఈఏ కింద పన్ను ప్రయోజనం

మొదటి సారి గృహాన్ని కొనుగోలు చేసే వారు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్-80ఈఈఏ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందవచ్చు. అంతేకాకుండా నివాస ఆస్తి స్టాంప్ డ్యూటీ విలువ రూ.45 లక్షల వరకు అందుబాటులో ఉంది. ఇవి కాకుండా గృహ రుణ ఆమోద తేదీ 2019 ఏప్రిల్ 01 నుంచి 2022 మార్చి 31 మధ్య ఉండాలి. సెక్షన్-80ఈఈఏ కింద ఆదాయపు పన్ను ప్రయోజనాన్ని పొందడానికి ఆదాయపు పన్ను కట్టేవారు ఈ నియమాలు కూడా తెలుసుకోవాలి.ఆస్తి స్టాంప్ డ్యూటీ విలువ రూ.45 లక్షల వరకు ఉండాలి.

-రుణ మంజూరు తేదీ 2019 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 మధ్య ఉండాలి.

-రుణ మంజూరు వరకు దరఖాస్తుదారుడు ఎలాంటి ఇతర ఆస్తులను కలిగి ఉండకూడదు.

-ఆదాయపు పన్ను సెక్షన్-8ఈఈఏ కింద ఏ మొత్తాన్ని క్లెయిమ్ కు పరిగణించకూడదు

-రుణాన్ని ఆర్థిక సంస్థ నుంచి మాత్రమే తీసుకోవాలి.

No comments

Powered by Blogger.