Latest

Loading...

Kakara kaya - చేదుగా ఉందని పక్కన పడేసే కాకరకాయ ఎంత మేలు చేస్తుందో తెలుసా..?

  Kakara kaya  - చేదుగా ఉందని పక్కన పడేసే కాకరకాయ ఎంత మేలు చేస్తుందో తెలుసా..?


మనం తినే ఆహారాల్లో కాకరకాయకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కానీ చాలా మందికి దీని పేరు వింటే చాలు వికారం పుట్టేస్తుంది. దానికి కారణం దాని రుచి. ఇంట్లో వాలు తినమని ఎంత చెబుతున్నా పిల్లలు పట్టించుకోరు. చేదుగా ఉంటుందని ఆహారంలో భాగం చేసుకోరు. అలాంటి వారు కాకరకాయ ప్రయోజనాలని దూరం చేసుకుంటున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, కాకరకాయని తినడం మొదలెడితే దాని చేదు రుచినైనా సరే ఇష్టపడతారు. అవును, కొంతమంది చేదుగా ఉండడాన్నే ఇష్టపడతారు. అది ఆరోగ్యానికి చేసే మేలు తెలిసినవాళ్ళు కాబట్టి దాన్ని ఆహారంలో భాగం చేసుకుంటారు. మీకింకా దాని విలువ తెలియకపోతే ఈ రోజే తెలుసుకోండి.


కాకరకాయ చేసే ప్రయోజనాలు


బరువును తగ్గిస్తుంది


కాకరకాయ లో తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి.

ఇవే కాదు కొవ్వులు, కేలరీలు తక్కువ పరిమాణంలో ఉంటాయి. అందువల్ల బరువు పెరగకుండా ఉంటారు. బరువు తగ్గాలని ఆలోచిస్తున్నవారు తమ డైట్ లో కాకరకాయని ఖచ్చితంగా చేర్చుకోవాల్సిందే.


జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది


కాకరకాయలో అధికశాతం ఫైబర్ ఉంటుంది. అందుకని జీర్ణక్రియ పనితీరు మెరుగవుతుంది. కాకరకాయ తిన్న తర్వాత హెవీగా అనిపించడం గానీ, ఆయాసంగా ఉండడం గానీ, అసిడిటీ గానీ అనిపించదు.


డయాబెటిస్ వారికి


ఇందులో రక్తంలోని చక్కెర శాతాన్ని నియంత్రించే పోషకాలు ఉంటాయి. అందుకే డయాబెటిస్ బారిన పడ్డవారిని కాకరకాయ జ్యూస్ తాగమని చెబుతుంటారు.


రోగనిరోధక శక్తిని పెంచుతుంది


ఇందులో ఉండే అనేక లక్షణాలు, విటమిన్ సి మొదలైనవి రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడతాయి.


చర్మ సంరక్షణ


ఐరన్, పొటాషియం ఉండడం వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. చర్మ సంరక్షణ కోసం చూసేవాళ్ళు వారానికి మూడు సార్లయినా కాకరకాయ రసాన్ని తాగితే చర్మం మృదువుగా అవడంతో పాటు నిగనిగలాడే మెరుపు వస్తుంది.

No comments

Powered by Blogger.