LIC Policy Status: మీ ఎల్ఐసీ పాలసీ డబ్బులు ఎప్పుడు వస్తాయి? ఇలా తెలుసుకోండి
మీ దగ్గర ఎల్ఐసీ పాలసీ ఉందా? మీ ఎల్ఐసీ పాలసీ ప్రీమియం ఎప్పుడు చెల్లించాలి? ఎల్ఐసీ నుంచి మీకు రావాల్సిన డబ్బులు ఎప్పుడు వస్తాయి? మీ పాలసీపై నామినీగా ఎవరి పేరు ఉంది? ఇలా మీ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం అవసరం. ఇలాంటి వివరాలు తెలుసుకోవడానికి మీరు ఎల్ఐసీ ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం లేదు. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC చాలావరకు సమాచారాన్ని టెక్నాలజీని ఉపయోగించుకొని ఆన్‌లైన్‌లోనే అందిస్తోంది. ఎల్ఐసీ ఇ-సర్వీస్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకొని ఈ సమాచారాన్ని పొందొచ్చు. లేదా ఎస్ఎంఎస్ ద్వారా ఈ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. మీ పాలసీ స్టేటస్‌ను సులువుగా తెలుసుకోవచ్చు. మరి మీ పాలసీ స్టేటస్ తెలుసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.
LIC e-Service Portal: ఎల్ఐసీ ఇ-సర్వీస్ పోర్టల్‌లో రిజిస్టర్ చేయండి ఇ
ముందుగా https://licindia.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో Customer Portal పైన క్లిక్ చేయండి.
New User పైన క్లిక్ చేయండి.
పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలతో రిజిస్టర్ చేయండి.
ఆ తర్వాత కేవైసీ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
మీరు ముందే ఎల్ఐసీ ఇ-సర్వీస్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసినట్టైతే https://ebiz.licindia.in/ వెబ్‌సైట్‌లో Customer Portal పైన క్లిక్ చేసి లాగిన్ కావొచ్చు. ఆ తర్వాత ఈ పోర్టల్‌లో వేర్వేరు సేవలు లభిస్తాయి. పాలసీ షెడ్యూల్, పాలసీ స్టేటస్, బోనస్ స్టేటస్, లోన్ స్టేటస్, క్లెయిమ్ స్టేటస్, రివైవల్ కొటేషన్, ప్రీమియం డ్యూ క్యాలెండర్, ప్రీమియం పెయిడ్ సర్టిఫికెట్, క్లెయిమ్ హిస్టరీ, పాలసీ బాండ్ లాంటివన్నీ తెలుసుకోవచ్చు.
LIC SMS Service: ఎల్ఐసీ ఎస్ఎంఎస్ సర్వీస్ ఉపయోగించండి ఇలా
ఎల్ఐసీ ఇ-సర్వీసెస్ పోర్టల్‌లో మాత్రమే కాదు ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఈ సేవల్ని పొందొచ్చు. ఇందుకోసం ఎల్ఐసీ 56767877, 9222492224 నెంబర్లను ఆపరేట్ చేస్తుంది. పాలసీహోల్డర్స్ తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఎల్ఐసీ సూచించిన ఫార్మాట్‌లో ఈ నెంబర్లకు ఎస్ఎంఎస్ పంపి వివరాలు తెలుసుకోవచ్చు. మరి ఏఏ ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ పంపాలో తెలుసుకోండి.
ఇన్‌స్టాల్‌మెంట్ ప్రీమియం: ASKLIC PREMIUM
నమినేషన్ వివరాలు: ASKLIC NOM
లోన్: ASKLIC LOAN
రివైవల్ అమౌంట్: ASKLIC REVIVAL
బోనస్ అడిషన్స్: ASKLIC BONUS
ఐపీపీ పాలసీ స్టేటస్: ASKLIC STAT
సర్టిఫికెట్ డ్యూ: ASKLIC ECDUE
యాన్యుటీ రిలీజ్ డేట్: ASKLIC ANNPD
యాన్యుటీ అమౌంట్: ASKLIC AMOUNT
చెక్ రిటర్న్ సమాచారం: ASKLIC CHQRET
ఇవే వివరాలను ఎల్ఐసీ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చు. ఎల్ఐసీ ఐవీఆర్ఎస్ సర్వీస్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్ యూజర్లు 12151 నెంబర్‌కు నేరుగా, ల్యాండ్‌లైన్, మొబైల్ యూజర్లు సిటీ కోడ్‌తో 12151 నెంబర్‌కు డయల్ చేయాలి.
No comments