Latest

Loading...

Statue of Unity: 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' సరికొత్త రికార్డ్... ఇప్పటివరకు ఎంత మంది చూశారో తెలుసా?


భారత తొలి ఉపప్రధాని, ఉక్కుమనిషి సర్ధార్ వల్లభ్భాయి పటేల్.. దేశంలోని 562 సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేయడంలో ముఖ్య పాత్ర వహించి, దేశాన్ని ఐక్యం చేసిన ఘనత ఆయన సొంతం. ఇటీవలే 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' పేరుతో ఆయన విగ్రహాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే. 182 మీటర్ల ఎత్తుతో గుజరాత్లోని నర్మద నదీ తీరాన నెలకొల్పిన ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా ప్రసిద్ధికెక్కింది. దీన్ని పటేల్ 143వ జయంతి సందర్భంగా 2018 అక్టోబర్ 31న ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ఎన్నో విశిష్టతలు ఉన్న ఈ విగ్రహం ఇప్పుడు సందర్శకుల విషయంలోనూ సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏకంగా 50 లక్షల మందికి పైగా పర్యాటకులు సందర్శించినట్లు గుజరాత్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ రావయస్సుతో నిమిత్తం లేకుండా, అన్ని వయస్సులకు చెందిన జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఈ ప్రాంతం ఆకర్షిస్తోందని రాజీవ్ గుప్తా పేర్కొన్నారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీని చూడటానికి దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు బారులు తీరుతున్నారని, దీంతో కెవాడియాలోని సర్ధార్ సరోవర్ డ్యాం వద్ద ప్రతి రోజూ సందడి నెలకొంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా గుర్తింపు దక్కించుకున్న ఈ ప్రాంతానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం అదనపు హంగులు జోడించింది. పర్యాటకులు ఈ ప్రాంతానికి సులభంగా చేరుకునేందుకు రైలు, విమాన రాకపోకలను మెరుగుపరిచింది. ఇందులో భాగంగానే ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఎనిమిది కొత్త రైళ్ళను కెవాడియాకు ప్రారంభించింది. అంతేకాక, అహ్మదాబాద్ నుంచి సీప్లేన్ సర్వీసులను కూడా ఏర్పాటు చేసింది.

నిత్యం లక్ష మంది సందర్శించే అవకాశం

అయితే, కరోనా విజృంభనతో 2020 మార్చి నుంచి దీని సందర్శనను నిలిపివేశారు. కోవిడ్ ఆంక్షల కారణంగా నిలిపివేసిన సందర్శనను.. ఏడు నెలల అనంతరం అక్టోబర్ 17న తిరిగి ప్రారంభించారు. కాగా, ఉత్తమ పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో 2021 జనవరి 18న ప్రధాన నరేంద్ర మోదీ దేశంలోని పలు ప్రాంతాల నుండి ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించారు. ప్రస్తుతం, మెరుగైన రవాణా సౌకర్యాల ఉన్న కారణంగా రోజుకు లక్ష మంది పర్యాటకులు కెవాడియాలోని సర్ధార్ పటేల్ 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ'ని సందర్శించే అవకాశం ఉందని ఇటీవల ఒక సర్వే స్పష్టం చేసింది. రోజు రోజుకూ ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో స్థానికులకు కూడా ఉపాధి దొరికినట్లవుతోంది. మరెందుకాలస్యం మీరు కూడా సర్దార్ పటేల్ విగ్రహాన్ని చూసేయండి.

 

No comments

Powered by Blogger.