Latest

Loading...

Telangana PRC: తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఆర్సీపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన


తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు అతి త్వరలో గుడ్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. పీఆర్సీని ఈ రెండు, మూడు రోజుల్లో ప్రకటించనున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా తీవ్ర చర్చకు, ఉద్యోగుల్లో అసంతృప్తికి కారణమైన పీఆర్సీ అంశానికి ఇక పుల్ స్టాప్ పెట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఇందుకు బలం చేకూరుస్తోంది. రెండు, మూడు రోజుల్లోనే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవప్రదమైన పీఆర్సీని ప్రకటిస్తామని శాసనసభ వేధికగా సీఎం ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడుతూ సీఎం ఈ ప్రకటన చేశారు. ఉద్యోగులపై తమ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో గత పీఆర్సీ ద్వారా తెలిపామన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో పీఆర్సీని ప్రకటించనున్నట్లు కేసీఆర్ చెప్పారు. దేశంలోనే అత్యధిక వేతనాలు తీసుకుంటున్న ఉద్యోగులుగా తెలంగాణ ఉద్యోగులు ఉండేలా వేతనాలు ఇస్తామని ఉద్యమ సమయంలో తాము చెప్పామని కేసీఆర్ గుర్తు చేశారు. ఇప్పటికే ఆ హామీని అమలు చేస్తున్నామన్నారు. తాజాగా మరో పీఆర్సీ ప్రకటించిన తర్వాత ఉద్యోగులపై తమ ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో దేశానికి తెలుస్తుందన్నారు. ఇదిలా ఉంటే కరోనా కారణంగా రాష్ట్రంపై సుమారుగా రూ. లక్ష కోట్ల భారం పడిందన్నారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ఏమిటనే దానిపై సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికీ చాలామంది అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ పాటనే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా భావిస్తూ వస్తున్నారు. అయితే ఇది తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం కాదని అన్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన సీఎం కేసీఆర్.. ఈ అంశంపై కూడా మాట్లాడారు. జయ జయహే తెలంగాణ పాటను తాము రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తించలేదని అన్నారు. రాష్ట్రం గీతం రాసుకున్నప్పుడు దాని గురించి ప్రకటన చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన ప్రముఖ గేయ రచయిత అందెశ్రీ ఈ గీతాన్ని రాశారు.

 

No comments

Powered by Blogger.