Tips to Reduce Snoring : మీరు గురక పెడతారా..! అయితే వీటిని పాటించి విముక్తి పొందండి..
Tips to Reduce Snoring : నిద్ర పోతున్నప్పుడు చాలా మందికి ఎదురైయే సమస్య గురక పెట్టడం. గురక పెట్టడం వల్ల పక్కన ఉన్న వారికి నిద్రాభంగం అవుతుంది. గుర్రు పెట్టె వారిపై చిరాకు, కోపం, చూపిస్తారు. గురక రావడానికి చాల కారణాలు ఉన్నాయి అనే చెప్పాలి. నోరు మూసుకొని గురకపెడుతుంటే. నాలుక లో సమస్య ఉందనితెలుసుకోవాలి. నోరు తెరిచి గురక పెడుతుంటే. గొంతులోని మృదువైన కణజాలలో సమస్యగా భావించాలి. వెల్లకిలా పడుకుని గురక పెడితే మాత్రం ప్రధాన సమస్యగా ఆలోచించాలి .
అయితే ఎలా నిద్ర పోతున్న కూడా గురక వస్తుంటే అది తీవ్ర సమస్య గానే చెప్పాలి. గురక సమస్యకు పరిష్కారం గా ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. గ్లాసు వేడి పాలలో రెండు టీ స్పూన్లు పసుపు పొడిని కలిపి తీసుకున్నాకూడా గురక సమస్య తీరుతుందిఅర టీ స్పూన్ తేనె అలాగే అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, కలిపి రాత్రి నిద్రపోయే ముందుతాగడం వలన గురక తగ్గుతుంది. మరిగే నీటిలో నాలుగైదు చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేసి రాత్రి నిద్రపోయే ముందు పది నిమిషాల పాటు ఆవిరి పడితే గురక రాకుండా ఉంటుంది. ఆవు నెయ్యిని కరిగేలా కొద్దిగా వెచ్చ పెట్టి రెండు చుక్కల చొప్పున రోజూ రెండు ముక్కు రంధ్రాలలో వేసి పీల్చితే గురక నుండి మంచి ఉపశమనం పొందవచ్చు. పయిన చెప్పిన వాటిల్లో ఏది చేసిన మంచి ఫలితం ఉంటుంది కాబట్టి ప్రయత్నించి చూడండి.
No comments