Twins Birth: పెరుగుతున్న కవలల జననాలు.. అసలు కారణమిదే? షాకింగ్ నిజాలు
సంతానం కలగడాన్ని మనిషి జీవితానికి మరో వరం అని అంటారు. అయితే కవల పిల్లల విషయంలో మాత్రం కొందరు ఆనందంగా ఫీలైతే మరికొందరు బాధపడతారు. కొంతమంది కవలలు పుడితే అదృష్టంగా భావిస్తే.. మరికొంతమంది దురుదృష్టంగా పరిగణిస్తారు. ఏదేమైనప్పటికీ గడిచిన కాలంతో పోలిస్తే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కవలల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. విశ్వవ్యాప్తంగా ఏటా 16 లక్షల కవలలు జన్మిస్తున్నారని, సగటున ప్రతి 42 మంది పిల్లల్లో ఒకరు కవలలుగా పుడుతున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి.
ఆలస్యంగా ప్రసవించడం, ఐవీఎఫ్ లాంటి వైద్య పద్ధతుల ద్వారా 1980 నుంచి కవలల జననాల రేటు మూడో వంతు పెరిగాయి. గర్భంలో ఒకే శిశువుపై దృష్టి ఉన్నందున కవలల గురించి పరిశోధన మరింత లోతుగా చేస్తున్నారు.హ్యూమన్ రీప్రొడక్షన్ జర్నల్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం గత 30 ఏళ్లల్లో కవలల జననాల రేటు ఆసియాలో 32 శాతం, ఉత్తర అమెరికాలో 71 శాతం మేర పెరిగాయి. ఇందుకోసం 2010 నుంచి 2015 వరకు 165 దేశాల నుంచి కవలల జననాలకు సంబంధించిన సమాచారాన్ని పరిశోధకులు సేకరించారు. వాటిని 1980-1985 మధ్య కాలం డేటాతో పోల్చి చూశారు. ఫలితంగా వెయ్యి డెలివరీల్లో పుట్టిన కవలల సంఖ్యను గమనిస్తే ఐరోపా, ఉత్తమ అమెరికాలో వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 1000 డెలివరీల్లో కవలల సంఖ్య 9 నుంచి 12కు చేరుకుంది. అయితే ఆఫ్రికాలో మాత్రం కవలల జననాల సంఖ్య ఎప్పుడూ అధికంగానే ఉంది. గత 30 ఏళ్లలో ఈ సంఖ్య పెద్దగా మారలేదు. అక్కడ జనాభా వేగంగా పెరిగేందుకు ఇది కూడా ఓ కారణం అని చెప్పవచ్చు.
ప్రస్తుతం ప్రపంచంలో మొత్తం కవలల జననాల రేటు ఆఫ్రికా, ఆసియాలోనే 80 శాతంగా ఉంది. ఆక్స్ ఫర్డ్ వర్సిటీకి ప్రొఫెసర్ క్రిస్టియన్ మోండెన్ ఇందుకు గల కారణాన్ని వివరించారు. "ఆఫ్రికాలో కవలల జననాల రేటు చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే డై జైగోటిక్ కవలలు అక్కడ అధికంగా ఉన్నారు. అంటే వేర్వేరు అండాల నుంచి పుట్టినవారు ఆఫ్రికాలో ఎక్కువగా ఉన్నారు. ఆఫ్రికా, ఇతర దేశాల జనాభా మధ్య ఉన్న జన్యుపరమైన తేడాలే ఇందుకు కారణం" అని తెలిపారు. ఐరోపా, ఉత్తర అమెరికా, ఓషెనిక్ దేశాల్లోనూ కవలల జననాల రేట్లు పెరుగుతున్నాయి. 1970 నుంచి వైద్యపరంగా సహాయపొందిన వారి సంఖ్య పెరుగుతుంది. ఉదాహరణకు ఐవీఎఫ్, ఐసీఎస్ఐ, కృత్రిమ గర్భధారణ లాంటివి ఇందుకు ప్రధాన కారణాలు.
మహిళలు కూడా గర్భనిరోధక మందులు వాడటం, సంతానోత్పత్తి పద్ధతులు అవలంభించడం వంటివి కవలల పెరుగుదలకు ప్రధాన పాత్ర పోషిస్తోందని సమీక్షలో తేలింది. అయితే ప్రస్తుతం చాలామంది ఏక సంతాన గర్భాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఎందుకంటే ఇవి సురక్షితమైనవని ప్రొపెసర్ మోండెన్ చెప్పారు. కవలలుగా పుట్టిన పిల్లల్లో మరణాల రేటు అధికంగా ఉంటుందని, గర్భాధారణ సమయంలో తల్లులు, పిల్లలు ఎక్కువ సమస్యలు కలిగి ఉంటారని ఆయన అన్నారు. కవలలకు పుట్టుకతోనే ఎక్కువ సమస్యలు ఉంటాయి. నెలలు నిండకముందే జన్మించడం, పుట్టినప్పుడు బరువు తక్కువగా ఉండడం లాంటివి జరుగుతున్నాయి.
అయితే కవలలు పుట్టిన తర్వాత వారు బతికే అవకాశాలు కూడా చాలా తక్కువ. మధ్య ఆదాయ దేశాల్లో ఈ పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తుందని సమీక్షలో తేలింది. సబ్-సహారా ఆఫ్రికాలో ప్రత్యేకించి చాలా మంది కవలలు మొదటి సంవత్సరాల్లోనే వారి జంటలో ఒకరిని కోల్పోతారు. ఏటా 2 లక్షల మందిలో ఇలా జరుగుతుంది. అయితే ధనిక పాశ్చాత్య దేశాల్లోనూ ఆఫ్రికాలో జన్మిస్తున్న ట్విన్స్ కు దగ్గరవుతున్నారని, బతికే అవకాశాల్లోనూ చాలా వ్యత్యాసం కనిపిస్తుందని ఈ అధ్యయన రచయిత ప్రొఫెసర్ జెరోయిన్ స్మిట్స్ తెలిపారు. భవిష్యత్తులో భారత్, చైనాలోనూ కవలల జననాల రేటు ముఖ్య పాత్ర పోషిస్తుందని పరిశోధకులు అంటున్నారు. సంతానోత్పత్తి క్షీణించడం, పుట్టినప్పుడు తల్లులు పెద్దవారు కావడం, ఐవీఎఫ్ లాంటి పద్ధతులు రాబోయే కాలంలో కవలల సంఖ్యపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.
No comments